For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందుకే 3వ రోజు నష్టాల్లో మార్కెట్లు: ఇన్వెస్టర్ల ఆందోళన ఏది, ఇవి కొనుగోలు చేయవచ్చా?

|

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ద్రవ్యోల్భణ భయాలకు తోడు అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయ దిగ్గజ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు పడిపోయాయి. అన్ని రంగాలు కూడా నష్టపోయాయి. ఆటో, మెటల్ సూచీలు రెండు శాతం చొప్పున క్షీణించగా, బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1.5 శాతం చొప్పున పతనమయ్యాయి. ఉదయం ఓ సమయంలో 60,000 పాయింట్లను క్రాస్ చేసినప్పటికీ, దాదాపు రోజంతా నష్టాల్లోనే ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 59,968.75 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,177.52 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,376.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం సెషన్‌లో 60,008.33 పాయింట్ల వద్ద ముగిసింది.

వరుసగా మూడో రోజు నష్టాల్లో

వరుసగా మూడో రోజు నష్టాల్లో

మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టపోయాయి. అన్ని రంగాలు నష్టపోయాయి. అయితే, ఆటో, మెటల్ రంగాలు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంకు 65 పాయింట్లు, మిడ్ క్యాప్ సూచీ 458 పాయింట్లు నష్టపోయింది. దాదాపు నిఫ్టీ స్టాక్స్ అన్ని నష్టపోయాయి. HCL, ఐచర్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. యూబీఎస్ డౌన్ గ్రేడ్ నేపథ్యంలో మిడ్ క్యాప్స్‌లో బాష్ టాప్ లూజర్‌గా నిలిచింది. నేడు లిస్ట్ అయిన పేటీఎం ఐపీవో భారీగా నష్టపోయింది. అదే షాపైర్ 4 శాతం, ఎస్కార్ట్ 10 శాతం లాభపడింది. ఎస్బీఐ, పవర్ గ్రిడ్, HDFC బ్యాంకు, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్ స్టాక్స్ మాత్రమే నష్టపోయాయి. సెన్సెక్స్ 24 స్టాక్స్ నష్టపోయాయి. నిఫ్టీ 50 స్టాక్స్‌లో 43 స్టాక్స్ నష్టపోయాయి.

 అందుకే నష్టాలు...

అందుకే నష్టాలు...

హోమ్ బిల్డింగ్ డేటా ఆధారంగా ధరల పెరుగుదల, లేబర్ షార్టేజ్ వంటి అంశాలు అమెరికా మార్కెట్ పైన ప్రభావం చూపాయి. ఫెడ్ రిజర్వ్ కూడా అంచనాల కంటే ముందే వడ్డీ రేట్లను సవరించే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అలాగే, అమెరికా అధ్యక్షులు జోబిడెన్ జెరోమ్ పోవెల్‌ను కొనసాగిస్తారా లేదా లాయెల్ బ్రెయినార్డ్‌ను ఫెడ్ చైర్ నామినీగా తీసుకుంటారా అనే అంశంపై ట్రేడర్స్ ఎదురు చూస్తున్నారని అంటున్నారు. యూరోప్‌లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కొత్త కేసులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్స్ దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా విక్రయాలకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.

స్టాక్స్ కొనుగోలు చేయవచ్చా?

స్టాక్స్ కొనుగోలు చేయవచ్చా?

రిస్క్ అని భావించే ఇన్వెస్టర్లు ప్రస్తుత పాక్షిక ప్రాఫిట్ బుకింగ వైపు కూడా మొగ్గు చూపుతున్నారని, అయితే ప్రస్తుత మార్కెట్ క్షీణత సమయంలో హై క్వాలిటీ లార్జ్ క్యాప్ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. ఐటీ, పైనాన్షియల్స్, సిమెంట్, పేయింట్స్, ఆటో రంగ షేర్లను కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. అయితే వచ్చే పన్నెండు నెలల కాలంలో ఇన్వెస్టర్లు మోటరేడ్ రిటర్న్స్‌ను ఎక్స్‌పెక్ట్ చేయవచ్చునని చెబుతున్నారు.

English summary

అందుకే 3వ రోజు నష్టాల్లో మార్కెట్లు: ఇన్వెస్టర్ల ఆందోళన ఏది, ఇవి కొనుగోలు చేయవచ్చా? | Sensex extends losses to third day, This is investors worry

Indian markets fell sharply today with Sensex extending losses to the third day. The Sensex settled over 350 points lower while Nifty ended 0.75% lower at 17764
Story first published: Thursday, November 18, 2021, 17:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X