సంవత్ 2077 నష్టాల్లో ముగింపు, భారీ లాభాల్లో ప్రారంభమై, భారీ నష్టాల్లోకి
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం నుండి నష్టాల్లోకి వెళ్లాయి. గత కొద్ది రోజులుగా ఆల్ టైమ్ గరిష్టం నుండి సూచీలు స్థిరీకరణ దిశగా సాగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కాస్త లాభాలు కనిపించినా ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉదయం మార్కెట్ లాభాల్లో ఉండగా, ఆ తర్వాత లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. రేపు (నవంబర్ 4, గురువారం) ముహూరత్ ట్రేడింగ్ ఉంది. దీనికి ముందు సూచీలు నష్టాల్లో ముగిశాయి.

లాభాల్లో ప్రారంభమై...
సెన్సెక్స్ నేడు ఉదయం 60,275.21 పాయింట్ల వద్ద మంచి లాభాల్లో ప్రారంభమైంది. నిన్న 60,029 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నేడు 60,361.82 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,552.49 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ నేడు 17,947.95 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,988.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,757.95 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
చివరకు సెన్సెక్స్ 257.14 (0.43%) పాయింట్లు నష్టపోయి 59,771.92 పాయింట్ల వద్ద, నిఫ్టీ 59.75 (0.33%) పాయింట్లు క్షీణించి 17,829.20 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఉదయం ఓ సమయంలో 300 పాయింట్లకు పైగా లాభపడింది. చివరకు 257 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 800 పాయింట్ల మేర పైకి, కిందకు కదలాడింది.

ఈ స్టాక్స్ భారీగా జంప్
మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. అయితే పలు స్టాక్స్ మాత్రం పది శాతం నుండి పదిహేను శాతం మేర లాభపడ్డాయి. 15 శాతం లాభపడిన స్టాక్స్‌లో ఫైనాన్షియల్(20.0%), ఒడిస్సీటెక్(20.0%), ఎకోనో ట్రేడ్(I)(20.0%), పాండీ ఆక్సైడ్ (20.0%), మనోమాయ్ టెక్స్ ఇండియా(19.67%), ఇనానీ మార్బుల్స్(19.66%), గోకుల్ రెఫోయిల్స్(16.55%) లాభపడ్డాయి.
ఇక, స్వస్తి వినాయక (13.99%), మనక్సియా కోటెడ్ (13.87%), ఆమ్కో ఇండియా(13.45%), సాల్జర్ ఎలక్ట్రో(12.87%), WPIL లిమిటెడ్(11.85%), స్వర్ణసరిత జెమ్స్ (11.64%), కపిల్ రాజ్ ఫైనాన్స్(11.43%), MBL ఇన్ఫ్రా(11.14%), POCL ఎంటర్‌ప్రైజెస్(10.99%), శివ మిల్స్ (10.0%) పది శాతానికి పైగా లాభపడ్డాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో లార్సన్ 4.07 శాతం, గ్రాసీమ్ 2.38 శాతం, UPL 2.33 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.26 శాతం, ఏషియన్ పేయింట్స్ 2.17 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో సన్ ఫార్మా 3.37 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.85 శాతం, భారతీ ఎయిర్టెల్ 2.08 శాతం, కోటక్ మహీంద్రా 1.88 శాతం, ICICI బ్యాంకు 1.87 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications