For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడో రోజు నష్టాల్లో మార్కెట్లు: రిలయన్స్, టీసీఎస్ డౌన్, కానీ ఈ స్టాక్స్ జంప్

|

స్టాక్ మార్కెట్లు మూడో రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సోమవారం ఒక్కరోజు అతి స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు మంగళవారం నుండి నష్టాల్లో ముగుస్తున్నాయి. సెన్సెక్స్ నేడు ఏకంగా 61,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. నిఫ్టీ 18,200 డాలర్ల కిందకు వచ్చింది. ఐటీ, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో సూచీలు వరుసగా నష్టపోతున్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకు, ఫైనాన్షియల్ స్టాక్స్ మంచి ప్రదర్శన చేశాయి.

భారీగా నష్టపోయిన రంగాల్లో ఐటీ, మెటల్స్, రియాల్టీ ఉన్నాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో 11 స్టాక్స్ మాత్రమే లాభపడగా, 19 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ స్టాక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంకు మాత్రమే నష్టపోయింది. మిగతా స్టాక్స్ రాణించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు శాతానికి పైగా నష్టపోయింది. ఏషియన్ పేయింట్స్ 5 శాతానికి పైగా దిగజారింది. రిలయన్స్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, టీసీఎస్ రెండు శాతానికి పైగా పడిపోయాయి.

వరుస నష్టాలు

వరుస నష్టాలు

సెన్సెక్స్ నేడు ఉదయం 61,557.94 పాయింట్ల వద్ద ప్రారంభమై, 61,621.20 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,485.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం సెషన్‌లో 61,259.96 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు మాత్రం 336.46 (0.55%) పాయింట్లు పతనమై 60,923.50 పాయింట్ల వద్ద ముగిసింది.

గతవారం 61,000 మార్కు దాటిన సెన్సెక్స్, ఈ వారం ఇప్పటికే 60,000 దిగువకు పడిపోయింది. ఈ వారం మార్కెట్‌కు మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. నిఫ్టీ 18,382.70 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,384.20 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 18,048.00 కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 88.50 (0.48%) పాయింట్లు నష్టపోయి 18,178.10 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ లూజర్స్, గెయినర్స్

టాప్ లూజర్స్, గెయినర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో కొటక్ మహీంద్రా బ్యాంకు 6.37 శాతం, టాటా మోటార్స్ 4.33 శాతం, గ్రాసీమ్ 3.15 శాతం, BPCL 2.26 శాతం, HDFC 1.75 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్ 5.29 శాతం, హిండాల్కో 3.74 శాతం, రిలయన్స్ 2.88 శాతం, ఇన్ఫోసిస్ 2.70 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2.15 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, రిలయన్స్, కొటక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.

ఈ స్టాక్స్ అదుర్స్

ఈ స్టాక్స్ అదుర్స్

మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టపోయాయి. కీలక రంగాలు, రిలయన్స్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు నష్టపోయాయి. కానీ నేడు పలు స్టాక్స్ 15 శాతం కంటే పైగా లాభపడ్డాయి. బాలూర్‌ఘాట్ టెక్(20.0%), షాపర్స్ స్టాప్ (20.0%), అరిహంత్ ఫౌండ్(19.92%), విశ్వరాజ్ సుగర్(19.82%), RTCL లిమిటెడ్(15.89%), IRB ఇన్‌ప్రా డెవలపర్స్(15.45%) లాభపడ్డాయి.

English summary

మూడో రోజు నష్టాల్లో మార్కెట్లు: రిలయన్స్, టీసీఎస్ డౌన్, కానీ ఈ స్టాక్స్ జంప్ | Sensex ends 336 points lower dragged by RIL, Infosys

Benchmark equity indices closed lower for the third day in a row. Sensex closed as 60,923.50, down 336. Intraday it hit a low of 60,489 points. Nifty settled at 18,178, down 0.5%, after hitting a low of 18,048.
Story first published: Thursday, October 21, 2021, 17:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X