గుడ్‌న్యూస్: HDFC, ICICI ప్రత్యేక స్కీం మార్చి 31 వరకు పొడిగింపు
HDFC బ్యాంకు, ICICI బ్యాంకు సీనియర్ సిటిజన్ల కోసం తమ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్(FD) పథకాన్ని మార్చి 31 వరకు పొడిగించింది. 2019లో మందగమనం, గత ఏడాది కరోనా కారణంగా వడ్డీ రేట్లు అంతకంతకూ పడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్ల కోసం ఈ ప్రయివేటురంగ దిగ్గజ బ్యాంకులు 2020 మే నెలలో ప్రత్యేక FD పథకాలను ప్రవేశపెట్టాయి. ప్రభుత్వరంగ ఎస్బీఐతో పాటు ఈ రెండు బ్యాంకులు FDలపై సీనియర్ సిటిజన్లకు వర్తించే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఉన్న రేట్ల మీద అదనపు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

HDFC స్కీం
సీనియర్ సిటిజన్ల కోసం HDFC బ్యాంకు స్పెషల్ FD పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ డిపాజిట్లపై 75 బేసిక్ పాయింట్ల అధిక వడ్డీ రేటును అందిస్తోంది. HDFC సీనియర్ సిటిజన్ కేర్ FD కింద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దీనిపై వచ్చే వడ్డీ రేటు 6.25 శాతం. ఈ రేట్లు నవంబర్ 13వ తేదీ నుండి వర్తిస్తాయి. అయిదేళ్ల నుండి పదేళ్ల వరకు రూ.5 కోట్ల కంటే తక్కువ FD చేస్తే ఆ సీనియర్ సిటిజన్లకు 0.25 శాతం అదనపు ప్రీమియం ఉంటుంది. మే 18, 2020 నుండి 31 మార్చి 2021 వరకు డిపాజిట్ చేసిన వారికి ఇది వర్తిస్తుంది.

ICICI స్కీం
ICICI బ్యాంకు కూడా గోల్డెన్ ఇయర్స్ పేరుతో స్పెషల్ వడ్డీ పథకాన్ని తీసుకు వచ్చింది. డిపాజిట్లపై 80 బేసిక్ పాయింట్స్ అధిక వడ్డీ రేటును అందిస్తోంది. గోల్డెన్ ఇయర్స్ FD పథకం సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 6.30 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ రేట్లు 21 అక్టోబర్ నుండి ప్రభావవంతంగా ఉంటాయి. 20 మే 2020 నుండి 2021 మార్చి 31 వరకు డిపాజిట్ చేసిన వారికి వర్తిస్తుంది.

SBI కూడా
ఈ పథకాన్ని గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రవేశ పెట్టినప్పటికీ పలుమార్లు పొడిగిస్తున్నారు. గతంలో డిసెంబర్ 31 వరకు, ఇప్పడు మార్చి 31 వరకు పొడిగించారు. ఎస్బీఐ కూడా ఇలాంటి పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఎస్బీఐ ఇదివరకే పొడిగించింది. సీనియర్ సిటిజన్ ప్రత్యేక FD పథకంపై 6.20 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications