డబ్బు తక్షణం అవసరమైతే, చాలా మంది రుణం తీసుకోవడం గురించి ఆలోచిస్తారు. కానీ, రుణాలు కూడా వేర్వేరు రకాలుగా ఉంటాయని తెలుసా? ముఖ్యంగా రెండు రకాల రుణాలు ఉంటాయి. హామీ ఉన్న రుణాలు మరియు హామీ లేని రుణాలు. ఈ రెండు రుణాల మధ్య తేడా అర్థం చేసుకుంటే, మనకి ఏ రుణం బెటర్ అనేది క్లారిటీ వస్తుంది. అలాగే భవిష్యత్తులో ఫైనాన్షియల్ సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.

హామీ ఉన్న రుణాలు అంటే ఏమిటి?
హామీ ఉన్న రుణాలు అనేది తాకట్టు పెట్టి తీసుకునే రుణం. అంటే, మీరు ఒక ఆస్తి (ఇంటి ప్రాపర్టీ, బంగారం, లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటివి) బ్యాంక్‌కి తాకట్టు పెడతారు. ఈ రుణంలో బ్యాంక్‌కి గ్యారంటీ సెక్యూరిటీ ఉంటుంది. మీరు చెల్లించలేకపోతే, వారు ఆ తాకట్టు ఆస్తిని అమ్మేసి తమ డబ్బు తిరిగి తీసుకుంటారు. అందుకే ఈ రుణాలపై "వడ్డీ రేట్లు తక్కువగా" ఉంటాయి, అలాగే చెల్లించే కాలం కూడా ఎక్కువ ఇస్తారు.
ఉదాహరణకి గృహ రుణం, కారు రుణం, ఆస్తిపై రుణం లాంటి రుణాలు తీసుకుంటే, వీటికి కోలేటరల్ హామీగా ఆస్తి ఉంటుంది. అందుకే బ్యాంక్‌కి రిస్క్ తక్కువగా అనిపిస్తుంది. అందువల్ల పెద్ద మొత్తంలో రుణం తీసుకోవాలన్నా, వీటికి అప్రూవల్ కూడా తేలిగ్గా వచ్చేస్తుంది.
హామీ లేని రుణాలు అంటే ఏమిటి?
హామీ లేని రుణాలు తీసుకోవడానికి ఏ ఆస్తి తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. బ్యాంక్ మీ క్రెడిట్ స్కోరు, ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం, చెల్లింపు చరిత్ర ఆధారంగా మాత్రమే ఇస్తుంది. ఈ రుణాల్లో బ్యాంక్‌కి గ్యారంటీ ఉండదు, అందుకే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి, చెల్లింపు కాలం తక్కువగా ఉంటుంది. వీటిని సాధారణంగా చిన్న మొత్తాలకే ఇస్తారు.
ఉదాహరణకి వ్యక్తిగత రుణం లేదా చాలా క్రెడిట్ కార్డులు ఇవి కోలేటరల్ లేకుండానే ఇచ్చే రుణాలు. అంటే ఎలాంటి ఆస్తి హామీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అందుకే ఎమర్జెన్సీగా డబ్బు అవసరమైనప్పుడు ఇవి చాలా త్వరగా లభిస్తాయి, వెంటనే ఉపయోగించుకోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి వీటిపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. సమయానికి చెల్లించకపోతే వడ్డీ బరువు రోజురోజుకు పెరుగుతుంది, మొత్తంగా చెల్లించాల్సిన అమౌంట్ కూడా చాలా ఎక్కువవుతుంది. కాబట్టి ఈ రుణాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని, సమయానికి తిరిగి చెల్లించగలిగే నమ్మకం ఉన్నప్పుడే వాడటం మంచిది.
ఖర్చు మరియు రిస్క్ తేడాలు
హామీ ఉన్న రుణాలు అంటే తాకట్టు పెట్టి తీసుకునే రుణాలు. వీటిపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి, అలాగే తిరిగి చెల్లించడానికి ఎక్కువ కాలం కూడా ఇస్తారు. ఇది బాగానే అనిపించినా, ఒక రిస్క్ ఉంటుంది. మీరు సమయానికి చెల్లించకపోతే బ్యాంక్ ఆ తాకట్టు పెట్టిన ఆస్తిని తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇక హామీ లేని రుణాలు అంటే ఎలాంటి తాకట్టు లేకుండానే ఇచ్చే రుణాలు. ఇవి చాలా త్వరగా లభిస్తాయి, అలాగే ఎలాంటి ఆస్తి పెట్టాల్సిన అవసరం ఉండదు. కానీ వీటిపై వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, మీ క్రెడిట్ స్కోర్
మంచి స్థాయిలో లేకపోతే బ్యాంకులు ఇవి ఇవ్వడానికి సుముఖం కావు. అంటే వీటిని పొందడం కొంచెం కష్టమే.
ఏది తీసుకోవాలి?
ఇది పూర్తిగా మీ ఆర్థిక స్థితి, అవసరం, చెల్లించే సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. మీ వద్ద విలువైన ఆస్తి (ఇంటి ప్రాపర్టీ, బంగారం) ఉంటే, తక్కువ వడ్డీతో, ఎక్కువ కాలం చెల్లించగలిగే హామీ ఉన్న రుణాలు మంచి ఆప్షన్. ఆస్తి తాకట్టు పెట్టకుండా తక్షణం డబ్బు కావాలనుకుంటే, మరియు మీరు సమయానికి తిరిగి చెల్లించగలరని నమ్మకం ఉంటే హామీ లేని రుణాలు బెటర్ ఆప్షన్.
ఎప్పుడూ రుణం తీసుకునే ముందు వడ్డీ రేట్లు, చెల్లింపు కాలం, ప్రాసెసింగ్ ఫీజులు వంటి వివరాలు బాగా పోల్చి చూసి నిర్ణయం తీసుకోవాలి. అలా చేస్తే భవిష్యత్తులో డెబ్ట్ ప్రెషర్ లేకుండా మన ఫైనాన్షియల్ ప్లాన్స్ సేఫ్‌గా ఉంటాయి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications