సెక్యూర్డ్-అన్‌సెక్యూర్డ్ రుణాలు తెలుసా? అలా అయితే వడ్డీ రేటు ఎక్కువ
మీకు రుణం అవసరం వచ్చిందా? ఎలాంటి రుణం తీసుకుంటున్నారు? బ్యాంకులు లేదా ఆర్థిక రంగ సంస్థలు ఇచ్చే రుణాలు సెక్యూర్డ్ లోన్స్, అన్-సెక్యూర్డ్ లోన్స్‌గా ఉంటాయి. వీటిపై వడ్డీ రేట్లు కూడా భిన్నంగా ఉంటుంది. సెక్యూర్డ్ లోన్ అయితే వడ్డీ రేటు కాస్త తక్కువగా, అన్-సెక్యూర్డ్ అయితే కాస్త ఎక్కువగా ఉంటుంది. అన్-సెక్యూర్డ్ రుణాల విషయానికి వస్తే పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు రుణం ఉదాహరణ. ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తాయి.
సెక్యూర్డ్ లోన్ అయితే ఇల్లు, జ్యువెల్లరీ, ల్యాండ్, వెహికిల్ లోన్ వంటివి. అంటే రుణగ్రహీత వద్ద ఉన్న ఆస్తిని తాకట్టు పెట్టుకొని, రుణం ఇస్తారు. ఈ రుణ వ్యాల్యూ బ్యాంకు వద్ద హామీ ఇచ్చిన ఆస్తి వ్యాల్యూ కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది.

సెక్యూర్డ్-అన్ సెక్యూర్డ్
సాధారణంగా రుణాలలో పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్, గోల్డ్ లోన్, రెంటల్ డిపాజిట్ లోన్, ప్రాపర్టీ లోన్, వెహికిల్ లోన్ వంటివి ఉంటాయి. అయితే వీటిలో సెక్యూర్డ్, అన్ సెక్యూర్డ్ ఉంటాయి. అన్-సెక్యూర్డ్ లోన్ కేటగిరీలో పర్సనల్ లోన్, స్టూడెంట్స్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్స్ ఉంటాయి. సెక్యూర్ట్ లోన్స్ అయితే వెహికిల్ లోన్, మోర్టగేజ్ లోన్, షేర్ సెక్యూర్ట్ లేదా సేవింగ్స్ సెక్యూర్డ్ లోన్, కార్ టైటిల్ లోన్స్, పాన్ షాప్ లోన్స్, లైఫ్ ఇన్సురెన్స్ లోన్స్ ఉన్నాయి.

సెక్యూర్డ్ లోన్ ప్రయోజనం
సెక్యూర్డ్ లోన్ అయితే రుణదాతలకు తక్కువ భయం ఉంటుంది. రుణం తీసుకున్న వ్యక్తి రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైతే బ్యాంకులు బకాయిలను వసూలు చేసుకోవడానికి తాకట్టు పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకుంటాయి. అలాగే, రుణ గ్రహీతలకు కూడా ప్రయోజనం ఉంది. తక్కువ వడ్డీ రేటుకే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాన్ని మంజూరు చేస్తాయి. రుణ సంస్థలు కూడా త్వరగా ఈ రుణాలకు ఆమోదం తెలుపుతాయి. దీర్ఘకాల పరిమితిని అందిస్తాయి. సురక్షిత రుణాల్లో బాగా ప్రాచుర్యం పొందింది హోమ్ లోన్, ఆ తర్వాత వెహికిల్ లోన్.
హోమ్ లోన్ తీసుకుంటే ఇంటిని పూచీకత్తుగా పెట్టుకొని బ్యాంకులు హోమ్ లోన్ ఇస్తాయి. ఇంటి వ్యాల్యూలో 75 శాతం నుండి 90 శాతం వరకు వస్తుంది. తిరిగి చెల్లింపులు చేసేందుకు గరిష్టంగా ముప్పై ఏళ్లు ఇస్తారు. ప్రతి నెల ఈఎంఐ రూపంలో చెల్లించాలి. రుణ చెల్లింపులో విఫలమైతే ఇంటిని వేలం వేసే అధికారం బ్యాంకుకు ఉంది. ఇలాగే బంగారం, వెహికిల్ లోన్ కూడా ఉంటుంది.

అన్-సెక్యూర్డ్ రుణం
అన్-సెక్యూర్డ్ అయితే నష్టభయం ఎక్కువ. కాబట్టి వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. ఎలాంటి పూచీకత్తు ఉండదు. అలాగే రుణగ్రహీతకు కూడా వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. నిబంధనలు, షరతులు ఎక్కువగా ఉంటాయి. రుణ మొత్తం తక్కువగా రావడంతో పాటు కాలపరిమితి తక్కువగా ఉంటుంది. సకాలంలో చెల్లించే సామర్థ్యం ఉంటేనే ఈ రుణాలు తీసుకోవాలి. లేదంటే క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం చూపుతుంది. తక్కువ వడ్డీ రేటు కోసం బ్యాంకులను సంప్రదించవచ్చు.


Click it and Unblock the Notifications