Mutual Funds: కరోనా తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త పెట్టుబడిదారుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో చాలా మంది పెట్టుబడులపై అవగాహన పెరగటంతో పాటు దాని గురించి పూర్తిగా తెలియనివారు సేఫ్టీ ఉండే మ్యూచువల్ ఫండ్స్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు అనుకూలంగా సెబీ పెద్ద అడుగు వేసింది. మ్యూచువల్ ఫండ్స్‌లో 'ఫ్రంట్-రన్నింగ్', ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను అరికట్టేందుకు సెబీ మంగళవారం చర్యలు చేపట్టింది. దీనికింద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు చేసే మార్కెట్ దుర్వినియోగాలను గుర్తించటం, పరిష్కరించటం కోసం ఒక సంస్థాగత వ్యవస్థను రూపొందించాలని SEBI బోర్డ్ నిర్ణయించింది. రెగ్యులేటర్ AMC వాయిస్‌ని పెంచడానికి 'విజిల్ బ్లోయర్' యంత్రాంగాన్ని సృష్టించడం ద్వారా పారదర్శకతను ప్రోత్సహించాలని కోరుతోంది. ఈ చర్యలు ఇన్వెస్టర్ల హక్కులను కాపాడేందుకు, వారి డబ్బును సురక్షితంగా ఉంచేందుతు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉద్యోగులు, డీలర్లు, స్టాక్ బ్రోకర్లు లేదా ఏదైనా ఇతర సంబంధిత సంస్థల ద్వారా సాధ్యమయ్యే అవకతవకలను గుర్తించి, నివేదించడానికి సంస్థాగత వ్యవస్థ పని చేస్తుందని సెబీ పేర్కొంది. ఇందులో అధునాతన పర్యవేక్షణ వ్యవస్థలు, అంతర్గత నియంత్రణ విధానాలు, నిర్దిష్ట రకాల అవకతవకలను గుర్తించడానికి, పర్యవేక్షించడానికి, పరిష్కరించేందుకు ఎస్కలేషన్ ప్రక్రియలు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లో ఫ్రంట్ రన్నింగ్, ఇన్‌సైడర్ ట్రేడింగ్, సున్నితమైన సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వంటివి ఉన్నాయి. బ్రోకర్ లేదా పెట్టుబడిదారు రహస్య సమాచారం ఆధారంగా వ్యాపారంలో పాలుపంచుకున్నప్పుడు దానిని ఫ్రంట్ రన్నింగ్ అని పిలుస్తారు. ఇది స్టాక్ మార్కెట్లోని షేర్ల ధరలను ప్రభావితం చేస్తుంది.
యాక్సిస్ అసెట్ మేనేజ్మెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన రెండు 'ఫ్రంట్-రన్నింగ్' కేసుల్లో SEBI జారీ చేసిన ఉత్తర్వుల మధ్య ఈ నిర్ణయం వచ్చింది. LIC కేసులో లిస్టెడ్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి ఒప్పందాలను ఫ్రంట్ రన్నింగ్ చేస్తున్నట్లు సెబీ కనుగొంది. అలాగే యాక్సిస్ ఏఎంసీ విషయంలో బ్రోకర్-డీలర్‌లు, కొంతమంది ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. ఇలాంటి తరుణంలో.. మ్యూచువల్ ఫండ్ బాడీ 'అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా' సెబీతో సంప్రదించి అటువంటి సంస్థాగత యంత్రాంగాల కోసం వివరణాత్మక ప్రమాణాలను నిర్దేశిస్తుంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications