పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), సుకన్య సమృద్ధి యోజన(SSY), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం(SCSS) వంటి స్మాల్ సేవింగ్స్ పథకాలపై ఇటీవల వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో దానిని వెనక్కి తీసుకుంది. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పైన వడ్డీ రేటును యథాతథంగా ఉంచుతున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఉన్న వడ్డీ రేట్లు కొనసాగుతున్నాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), కిసాన్ వికాస్ పత్ర (KVP), సుకన్య సమృద్ధి యోజన వంటి పన్నెండు ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి.

సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు (SSY)
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన స్మాల్ సేవింగ్స్ స్కీం సుకన్య సమృద్ధి యోజన. ఈ స్కీంలో ఇన్వెస్టర్లు పోస్టాఫీసులు, కేంద్ర ప్రభుత్వ రంగ, ప్రయివేటు రంగ బ్యాంకుల్లో చేరవచ్చు. ఫిక్స్డ్ ఆదాయం కేటగిరీకి చెందిన వారికి అత్యంత రివార్డింగ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు కలిగిన పథకాల్లో ఇది ఒకటి. ఇద్దరు అమ్మాయిల వరకు ఈ స్కీంలో పెట్టుబడి పెట్టవచ్చు. రెండో కాన్పులో కవలలు పుడితే అమ్మాయిలకు అవకాశముంది. ఒక అమ్మాయిపై ఒక అకౌంట్ తీసుకోవాలి.
అకౌంట్ హోల్డర్ ఓపెన్ చేసినప్పటి నుండి 21 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. లేదా 18 ఏళ్లు నిండి పెళ్లికోసం.. ఇందులో ఏది ముందు అయితే అప్పుడు మొత్తాన్ని తీసుకోవచ్చు. పెళ్లయితే మెచ్యూరిటీ పూర్తి కానప్పటికీ అకౌంట్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుమతి ఉండదు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250, గరిష్టం రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. మంచి వడ్డీ రేటు వచ్చే స్మాల్ సేవింగ్స్ స్కీంలలో SSY ఒకటి. ప్రస్తుతం వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది.

SCSS
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం (SCSS)ను కేంద్రం 2004లో ప్రారంభించింది. గ్యారంటీ రిటైర్మెంట్ ఆదాయ స్కీం ఇది. 60 సంవత్సరాలు దాటిన భారతీయులు ఈ స్కీంలో పెట్టుబడి పెట్టవచ్చు. సూపర్ న్యూమరేషన్ లేదా స్వచ్చంధ లేదా ప్రత్యేక స్వచ్చంధ రిటైర్మెంట్ పథకం కింద రిటైరైన వారికి 55 ఏళ్లకు ఇది వర్తిస్తుంది. దీనిపై వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. ప్రతి మూడు నెలలకు ఓసారి వడ్డీ రేటును సవరిస్తారు.
కనీసం రూ.వెయ్యి, గరిష్టం రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. రూ.1000 చొప్పున ఎన్నిసార్లు అయినా డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం కాలపరిమితి అయిదేళ్లు. మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. రిటైర్డ్ ఉద్యోగి వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామితో కలిసి చేరవచ్చు.

PPF
రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం లాంగ్ టర్మ్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా సరైన పెట్టుబడి ఎంపిక. అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. పన్ను ప్రయోజనాలు, పన్ను మినహాయింపులు, అమౌంట్ మొత్తానికి సెక్యూరిటీ ఉంటాయి. ఆదాయపన్ను చట్టం కింద వడ్డీకి, రిటర్న్స్‌కు పరిమితి మేరకు పన్ను వర్తించదు. ఇటీవలి కాలంలో మంచి పన్ను సేవింగ్ స్కీంలలో ఇది ఒకటి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications