High FD Rate: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.60 శాతం వడ్డీ.. ఈ బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయ్..!
Fixed Deposit: ద్రవ్యోల్బణాన్ని తగ్గించే క్రమంలో దేశంలోని బ్యాంకులను పర్యవేక్షించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. అయితే దీని వల్ల డబ్బు బ్యాంకుల్లో సురక్షితంగా రెట్టింపు చేసుకోవాలనుకునే వారికి సువర్ణావకాశం లభించింది.
ఈ క్రమంలో చాలా మంది భారతీయ ప్రజలు తమ డబ్బును బ్యాంకుల వద్ద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని చూస్తున్నారు. దీనికి తోడు గత కొన్నేళ్లుగా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని చెల్లించడం ప్రారంభించాయి. అనేక బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తమ కస్టమర్లకు గరిష్ఠంగా 9.60 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. అయితే మూడేళ్ల కాలపరిమితికి చేసే బ్యాంక్ FDపై తమ కస్టమర్‌లకు గరిష్టంగా 8.60% వరకు వడ్డీని అందిస్తున్న బ్యాంకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

SBM Bank:
మీరు డబ్బును 3 ఏళ్ల పాటు FDలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. SBM బ్యాంక్ అత్యుత్తమ ఎంపికల్లో ఒకటిగా ఉంది. SBM బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 3 సంవత్సరాలకు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.10% వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇదే సమయంలో సీనియర్ సిటిజన్ కస్టమర్లకు ఇదే కాలానికి గరిష్ఠంగా 8.60% వడ్డీని చెల్లిస్తోంది.
DCB Bank:
ఇక డీసీబీ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 3 సంవత్సరాల FDపై 8% వడ్డీని అందిస్తోంది. అలాగే బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు ఇదే కాలానికి ఏకంగా 8.50% వరకు వడ్డీని అందిస్తోంది.
Yes Bank:
ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యెస్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లు మూడేళ్ల కాలానికి చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 7.75 శాతం వడ్డీని అందుబాటులో ఉంచింది. అలాగే తన బ్యాంకులోని సీనియర్ సిటిజన్ కస్టమర్లకు ఇదే కాలానికి ఏకంగా 8.25% వడ్డీని అందిస్తోంది. దీంతో పెట్టుబడిదారులు తమ మధ్య కాల లక్ష్యాల కోసం డబ్బును 3 ఏళ్ల ఎఫ్‌డిలో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications