SBI ఎన్ఏవీ-ఈక్యాష్ కార్డు: కార్డు ఫీచర్స్, ప్రయోజనాలు
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) భారత అతిపెద్ద నావల్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రమాదిత్యలో ఎస్బీఐ NAV-eCash కార్డును ఆవిష్కరించాయి. సముద్రాల్లో నౌకను మోహరించే సమయంలో భౌతిక నగదు నిర్వహణ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ కార్డు తొలగిస్తుందని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. నావికాదళ ఓడల వద్ద మౌలిక సదుపాయాలు సంప్రదాయ చెల్లింపుల సొల్యూషన్స్‌ను నిరోధిస్తాయని వెల్లడించింది.
ప్రత్యేకించి నౌకా సముద్రాలలో ఉన్నప్పుడు అనుసంధానత ఉండకపోవడం ఇందుకు ఓ కారణం. NAV-eCash కార్డు తన డ్యూయల్ చిప్ టెక్నాలజీతో అటు ఆన్‌లైన్, ఇటు ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌ను సులభతరం చేస్తుందని బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి తెలిపారు.

ఎస్బీఐ NAV-eCash కార్డు ప్రారంభం డిజిటల్ చెల్లింపుల పరిష్కారం కోసం ఒక ముఖ్యమైన మైలురాయి అని, కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా విజన్‌కు, ఆర్థిక వ్యవస్థలో తక్కువ నగదు మార్పు దిశగా ఎస్బీఐ నిబద్దతకు ఇది నిదర్శనంగా చెబుతున్నారు. NAV-eCash కార్డు డ్యూయల్ చిప్ టెక్నాలజీ ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్ ట్రాన్సాక్షన్స్‌ను సులభతరం చేస్తుంది. ఈ కార్డు ఆలోచనను ఎస్బీఐష నేవీ అధికారులు సంయుక్తంగా తీసుకు వచ్చారు. ఓడలో ప్రయాణించే సమయంలో నగదుపై ఆధారపడకుండా సులభతరం చేస్తుంది.
రక్షణ దళాల పట్ల బ్యాంకు నిబద్దత, భారత సాయుధదళాలతో తమ సుదీర్ఘ బంధాన్ని మరోసారి నొక్కి చెప్పిందన్నారు. రక్షణ దళాలతో సంబంధం ఉన్నందున గర్వంగా భావిస్తున్నట్లు సీఎస్ శెట్టి తెలిపారు. ఆస్తులు, డిపాజిట్లు, శాఖలు, కస్టమర్లు, ఉద్యోగుల పరంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతిపెద్ద వాణిజ్య బ్యాంకు. ఇది దేశంలోనే అతిపెద్ద రుణదాతగా ఉంది. ఇప్పటి వరకు 30 లక్షల భారతీయ కుటుంబాల ఇంటి కొనుగోలు కలను నెరవేర్చింది.


Click it and Unblock the Notifications