75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని రిటైల్ డిపాజిటర్లకు ప్రత్యేక ప్రయోజనాలను అందించేందుకు ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఎస్బీఐ ప్లాటినమ్ డిపాజిట్స్ పేరుతో స్పెషల్ డిపాజిట్ స్కీంను ప్రవేశపెట్టింది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే. మరో వారం రోజుల్లో ఈ స్కీం గడువు ముగియనుంది.
ఇందులో 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలపరిమితితో టర్మ్ డిపాజిట్స్‌ను స్వీకరిస్తారు. డిపాజిటర్స్ ఈ పథకం ద్వారా 15 బేసిస్ పాయింట్ల వరకు అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందవచ్చు. సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఈ పథకం అమలులో ఉంది. ఎస్బీఐ ఇటీవల ఈ Platinum Deposits స్కీంను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇండివిడ్యువల్స్, సీనియర్ సిటిజన్లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
ఆగస్ట్ నెల 15వ తేదీ నుండి సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని బ్యాంకు గత నెలలో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. సదరు డిపాజిట్స్ పైన అదనపు వడ్డీ రేటును కల్పిస్తున్నట్లు తెలిపింది. 'ప్లాటినమ్ డిపాజిట్ స్కీంతో భారత్ 75వ స్వతంత్ర దినోత్సవ సంబరాలను జరుపుకోవాల్సిన సమయం ఇది.' అని పేర్కొంది.

ఎస్బీఐ ప్లాటినమ్ డిపాజిట్స్ స్కీం కింద రెగ్యులర్ వడ్డీ రేట్లు
ప్లాటినమ్ - 75 రోజులు - 3.95 శాతం,
ప్లాటినమ్ - 525 రోజులు - 5.10 శాతం,
ప్లాటినమ్ - 2250 రోజులు - 5.55 శాతం.

ఎస్బీఐ ప్లాటినమ్ డిపాజిట్స్ స్కీం కింద సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు
ప్లాటినమ్ - 75 రోజులు - 4.45 శాతం,
ప్లాటినమ్ - 525 రోజులు - 5.60 శాతం,
ప్లాటినమ్ - 2250 రోజులు - 6.20 శాతం (ఎస్బీఐ వికేర్ స్కీం కింద వడ్డీ రేటు వర్తిస్తుంది)

అర్హత
ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో టర్మ్ డిపాజిట్లతో సహా రూ. 2 కోట్ల లోపు దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్స్‌ను ఎస్బీఐ ప్లాటినం డిపాజిట్ స్కీం కింద అనుమతిస్తారు.
ఎన్ఆర్ఈ డిపాజిట్స్ కేవలం 525 రోజులు, 2250 రోజులకు వర్తిస్తుంది.
కొత్త డిపాజిట్స్‌తో పాటు రెన్యూవల్ చేసిన డిపాజిట్స్‌కు ఈ పథకం వర్తిస్తుంది.
టర్మ్ లేదా స్పెషల్ టర్మ్ డిపాజిట్స్‌కు మాత్రమే ఈ స్కీం వర్తిస్తుంది.
టర్మ్ డిపాజిట్స్ నెలవారీగా లేదా త్రైమాసికం వారీగా చెల్లిస్తారు. స్పెషల్ టర్మ్ డిపాజిట్స్ మాత్రం మెచ్యూరిటీ తేదీన చెల్లిస్తారు.
SBI సాధారణ ఖాతాదారులకు ఏడు రోజుల నుండి పదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన వడ్డీ రేట్లు 2.9 శాతం నుండి 5.4 శాతం వరకు ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు యాభై బేసిస్ పాయింట్లు లేదా 0.50 శాతం అదనపు వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ వడ్డీ రేట్లు జనవరి 2021 నుండి అమలులోకి వచ్చాయి.
సీనియర్ సిటిజన్స్ కోసం ఎస్బీఐ వీకేర్ పేరుతో ప్రత్యేక డిపాజిట్ స్కీం అందిస్తోంది. అయిదేళ్లు అంతకంటే ఎక్కువ కాలపరిమితితో ఈ పథకంలో డిపాజిట్ చేసిన సీనియర్ సిటిజన్స్‌కు సాధారణంగా వర్తించే వడ్డీ రేటు కంటే ముప్పై బేసిస్ పాయింట్లు అదనంగా లభిస్తుంది. రెగ్యులర్ వడ్డీ రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు అదనం.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications