SBI special FD: అదిరిపోయే ఈ స్కీంను మార్చి వరకు పొడిగించిన ఎస్బీఐ

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సీనియర్ సిటిజన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. వీరి కోసం వీకేర్ సీనియర్ సిటిజన్స్ టర్మ్ డిపాజిట్ పేరుతో ఎస్బీఐ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంను 2020 మే నెలలో ప్రారంభించింది. ఈ ప్రత్యేక పథకాన్ని ఎస్బీఐ మరోసారి పొడిగించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ పథకాన్ని ఇప్పటికే పలుమార్లు పొడిగించింది బ్యాంకు. తాజాగా ఈ గడువును మరోసారి మార్చి 31, 2022 వరకు పొడిగించింది. ఎస్బీఐతో పాటు HDFC బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంకు వంటి బ్యాంకులు కూడా సీనియర్ సిటిజన్స్ కోసం ఇలాంటి ప్రత్యేక FD స్కీంను ప్రవేశ పెట్టాయి.

ఎస్బీఐ వీ-కేర్ స్కీం

ఎస్బీఐ వీ-కేర్ స్కీం

సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం ఎస్బీఐ ప్ర‌త్యేక FD స్కీమ్‌ వీ-కేర్ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు వారి FDలో అయిదు సంవ‌త్స‌రాలు, అంత‌కంటే ఎక్కువ కాలం పాటు 0.30 శాతం అదనపు వ‌డ్డీ రేటును అందిస్తుంది. మే 2020లో, దేశంలోని పెద్ద బ్యాంకుల్లో ఒక‌టైన ఎస్బీఐ సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం ఎస్బీఐ వీ-కేర్ సీనియ‌ర్ సిటిజ‌న్స్ ట‌ర్మ్ డిపాజిట్ స్కీంను ప్ర‌క‌టించింది.

ప్రారంభంలో సెప్టెంబ‌ర్ 2020 వ‌ర‌కు ఉండేది. కరోనా ప‌రిస్థితుల్లో ప్ర‌త్యేక FD ప‌థ‌కం పలుమార్లు పొడిగించ‌బ‌డింది. ఇప్పుడు మరోసారి వ‌చ్చే ఏడాది మార్చి చివ‌రి వరకు పొడిగించింది. రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో ప్రవేశపెట్టిన సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక ఎస్బీఐ వీ-కేర్ డిపాజిట్ 0.30 శాతం అదనపు ప్రీమియం సీనియర్ సిటిజన్స్‌కు వారి రిటైల్ టర్మ్ డిపాజిట్స్‌లో అయిదేళ్ల కాలవ్యవధికి చెల్లిస్తారు.

అన్ని బ్యాంకులూ పొడిగింపు

అన్ని బ్యాంకులూ పొడిగింపు

సీనియ‌ర్ సిటిజన్స్ కోసం ఎస్బీఐ ప్ర‌త్యేక FD స్కీమ్ వీ-కేర్ స్కీం FDలో అయిదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలపరిమితిపై 0.30 శాతం వ‌డ్డీ రేటును అందిస్తుంది. ప్ర‌స్తుతం ఎస్బీఐ సాధారణ వడ్డీ రేటు అయిదేళ్ల కాలపరిమితి పైన 5.4 శాతం వ‌డ్డీ రేటు ఉంది. సీనియ‌ర్ సిటిజ‌న్ ప్ర‌త్యేక FD స్కీం వీ కేర్ కింద FD చేస్తే వ‌డ్డీ రేటు 6.20 శాతంగా ఉంటుంది. ఈ రేట్లు 8 జ‌న‌వ‌రి 2021 నుండి అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఈ ప్రత్యేక స్కీంను ఇతర బ్యాంకులు కూడా అందుబాటులోకి తెచ్చాయి. సీనియర్ సిటిజన్ ప్రత్యేక స్కీంను ఇప్పటికే పలుమార్లు పొడిగించారు. HDFC బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలు ప్రత్యేక పథకాలను సెప్టెంబ‌ర్ 30, 2021 వ‌ర‌కు పొడిగించగా, ఐసీఐసీఐ గోల్డెన్ ఇయ‌ర్ FD అక్టోబ‌ర్ 7, 2021 వ‌ర‌కు పొడిగించింది.

ఆయా బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ ప్రత్యేక స్కీంలు ఇవే

ఆయా బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ ప్రత్యేక స్కీంలు ఇవే

సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం SBI బ్యాంకు We Care ప్ర‌త్యేక డిపాజిట్ స్కీంను ప్రారంభించింది. అయిదేళ్లు అంత‌కంటే ఎక్కువ కాల‌ప‌రిమితితో ఈ స్కీంలో డిపాజిట్ చేసిన సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు సాధార‌ణంగా వ‌ర్తించే వ‌డ్డీ రేటు కంటే 30 బేసిస్ పాయింట్లు అదనంగా ఉంటుంది. రెగ్యులర్‌గా వ‌ర్తించే వడ్డీ రేటు కంటే 80 బేసిస్ పాయింట్ల అద‌న‌పు వ‌డ్డీ రేటు ఉంటుంది. ప్ర‌స్తుతం, ఎస్బీఐ సాధార‌ణ వడ్డీ రేటు అయిదేళ్ల కాలపరిమితిపై 5.4 శాతంగా ఉంది. సీనియ‌ర్ సిటిజ‌న్ ప్ర‌త్యేక FD స్కీంలో చేరితో 6.20 శాతం వడ్డీ ఉంటుంది.

HDFC బ్యాంకు HDFC సీనియ‌ర్ సిటిజ‌న్ కేర్ పేరుతో స్పెష‌ల్ FD స్కీంను సీనియర్ సిటిజన్స్ కోసం అందుబాటులోకి తెచ్చింది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు సాధార‌ణంగా ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే 25 బేసిస్ పాయింట్లు అదనంగా ఉంటుంది. ఈ స్కీం ద్వారా రెగ్యులర్ వడ్డీ రేటు కంటే 75 బేసిస్ పాయింట్లు అధికంగా అందిస్తోంది. ఈ డిపాజిట్స్ పైన వర్తించే వ‌డ్డీ రేటు 6.25 శాతం.

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా స్పెషల్ FD స్కీం డిపాజిట్స్ పైన 100 బేసిస్ పాయింట్లు అధిక వ‌డ్డీ రేటును అందిస్తోంది. ప్ర‌త్యేక FD ప‌థ‌కం కింద (అయిదు సంవ‌త్స‌రాల నుండి పది సంవ‌త్స‌రాల వ‌ర‌కు) ఒక సీనియ‌ర్ సిటిజ‌న్ ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే, FDకి వ‌ర్తించే వ‌డ్డీ రేటు 6.25 శాతం ఉంటుంది.

ICICI బ్యాంకు గోల్డెన్ ఇయర్స్ పేరుతో సీనియర్ సిటిజన్ ప్రత్యేక FD స్కీంను తీసుకు వచ్చింది. సాధారణ వడ్డీ రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకం ద్వారా అందించే ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 6.30 శాతంగా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+