SBI SME Gold Loan: ఆ డాక్యుమెంట్స్ లేకుండా రూ.50 లక్షల వరకు రుణం
స్మాల్ అండ్ మైక్రో వ్యాపారాల ఆర్థిక అవసరాలు తీర్చే ఉద్దేశ్యంలో భాగంగా ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వివిధ రకాల లోన్లు ఆఫర్ చేస్తోంది. ఇలా అందించే లోన్‌లలో SBI SME Gold Loan తక్కువ వడ్డీతో అందిస్తోంది. మీ వ్యాపార అభివృద్ధి కోసం ఆర్థికంగా అవసరమైనప్పుడు ఈ రుణం ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఎస్ఎంఈలకు ఇబ్బందులు లేకుండా బంగారం లేదా బంగారు ఆభరణాలను కుదువ పెట్టుకొని తక్కువ వడ్డీకి ఆర్థిక అవసరాలు తీర్చడమే SBI SME గోల్డ్ లోన్ ప్రధాన ఉద్దేశ్యం.

బంగారంపై రుణం ఈజీ
ఎవరికైనా అత్యవసరంగా రుణం కావాలంటే బంగారం పైన త్వరగా వస్తుంది. బంగారం వ్యాల్యూలో కొంత మొత్తాన్ని రుణంగా ఇస్తారు. ఇటీవలి కాలంలో బంగారం ధరలు కాస్త సానుకూలంగా ఉన్నాయి. కాబట్టి రుణమొత్తం ఎక్కువే వస్తుంది. అయితే పది నెలల కనిష్టానికి బంగారం ధర పడిపోయినందున గత ఆరేడు నెలల కాలంలో వచ్చినంతగా రాకపోవచ్చు. ఏదేమైనా చదువుల కోసం, కంపెనీ వృద్ధి, ఇతర ఆర్థిక అవసరాల కోసం వెంటనే రుణం కావాలంటే బంగారం ఒక మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. వ్యాపార వృద్ధి కోసం ఎస్బీఐ SBI SME Gold Loanను అందిస్తోంది.

ప్రయోజనాలు
ఎంఎస్ఎంఈలకు ఓవర్ డ్రాఫ్ట్ (OD), డిమాండ్ లోన్ (DL).
లోన్ మొత్తం రూ.1 లక్ష నుండి రూ.50 లక్షల వరకు ఇస్తారు.
కాంపిటీటివ్ వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంటుంది. ఈబీఎల్ఆర్‌కు లింక్ అయి ఉంటుంది.
ఎలాంటి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అవసరం లేదు.
సెల్ఫ్ డిక్లేర్డ్ ప్రాజెక్టెడ్ టర్నోవర్ ఇస్తే సరిపోతుంది.
బ్యాలెన్స్ షీట్ అవసరం లేదు.

ప్రాసెసింగ్ ఫీజు
రూ.10 లక్షల వరకు లోన్ మొత్తం పైన ప్రాసెసింగ్ ఫీజు రూ.500+వర్తించే పన్నులు
రూ.10 లక్షలకు పైగా లోన్ మొత్తం పైన ప్రాసెసింగ్ ఫీజు రూ.1000+వర్తించే పన్నులు
ఓవర్ డ్రాఫ్ట్, డిమాండ్ లోన్ గరిష్టంగా 12 నెలల వరకు.
రుణం మొత్తాన్ని ముందుగానే చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు.
రుణ మొత్తం బంగారం ముందస్తు వ్యాల్యూను మించకూడదు.


Click it and Unblock the Notifications