For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI Savings Plus Account: సేవింగ్స్ ప్లస్ అకౌంట్ గురించి 4 కీలక విషయాలు తెలుసుకోండి

|

అత్యవసరంగా లేదా వ్యక్తిగత ఆర్థిక అవసరాలను అధిగమించేందుకు మీ పోర్ట్‌పోలియోలో సేవింగ్స్ అకౌంట్ తప్పనిసరి. సేవింగ్స్ అకౌంట్స్ ఉంటే ద్రవ్య లభ్యత, నిధుల భద్రత, ఫండ్ బదలీ సౌకర్యం, డిపాజిట్ మొత్తంపై వడ్డీ మొదలైన ప్రయోజనాలు ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనం ఆలోచించే రెండు అంశాలు సేవింగ్స్ పైన ఉత్తమ వడ్డీ రేట్లు అందించే బ్యాంకు, అలాగే, సేవింగ్స్ అకౌంట్స్ అందించే టాప్ బ్యాంకులను చూస్తాం. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఎస్బీఐ ఆఫర్ చేసే సేవింగ్స్ ప్లస్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. ఈ అకౌంట్ గురించి చాలామందికి తెలియని నాలుగు విషయాలు....

SBI సేవింగ్స్ ప్లస్ అకౌంట్ అంటే...

SBI సేవింగ్స్ ప్లస్ అకౌంట్ అంటే...

ఎస్బీఐ ప్రకారం ఎస్బీఐ సేవింగ్స్ ప్లస్ ఖాతా అనేది మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీం(MODS)తో అనుసంధానించబడిన ఒక సేవింగ్స్ బ్యాంకు అకౌంట్. ఈ అకౌంట్‌లో నిర్ణీత స్థాయి మించిన తర్వాత ఉన్న అదనపు డబ్బులు ఆటోమేటిక్‌గా టర్మ్ డిపాజిట్లుగా మారిపోతాయి. మినిమం బ్యాలెన్స్ విషయానికి వస్తే ఈ సేవింగ్స్ ప్లస్ అకౌంట్‌లో కనీసం రూ.3000 ఉండాలి. అకౌంట్‌ను ఖాతాదారులు సింగిల్‌గా లేదా జాయింట్‍‌గా ఓపెన్ చేయవచ్చు. కేవైసీ డాక్యుమెంట్స్ కలిగిన వారు ఈ సేవింగ్స్ ప్లస్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. అకౌంట్‌లో ఖాతాదారులు ఒక సంవత్సరం నుండి అయిదేళ్ల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్‌కు వర్తించే వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ప్రస్తుతం ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5 శాతం నుండి 5.30 శాతంగా ఉంది. ఈ ఖాతాలో అకౌంట్‌లోని డబ్బులకు లిమిట్ పెట్టుకోవచ్చు. ఒకేసారి రూ.10వేలు ట్రాన్సుఫర్ అవుతాయి.

ఎస్బీఐ సేవింగ్స్ ప్లస్ అకౌంట్ ఫీచర్స్

ఎస్బీఐ సేవింగ్స్ ప్లస్ అకౌంట్ ఫీచర్స్

ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ ఫీచర్స్ ఇక్కడ తెలుసుకోండి...

ఒకరు ఈ అకౌంట్‌ను ఏఢాది నుండి అయిదేళ్ల కాలానికి ఓపెన్ చేయవచ్చు.

ఈ ఖాతా తీసుకుంటే 25 చెక్ లీవ్స్, పాస్ బుక్, ఏటీఎం కార్డు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్సెమ్మెస్ అలర్ట్ ఫీచర్స్ అందిస్తారు.

ఎవరైనా మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీం (MODS) అకౌంట్ పైన లోన్ తీసుకోవచ్చు.

అకౌంట్‌కు కనీసం రూ.35000 లిమిట్ ఉండాలి. కనీసం ఒకసారి రూ.10,000 MOD అకౌంట్‌కు ట్రాన్సుఫర్ చేస్తారు.

ఎస్బీఐ ప్రకారం ఉపసంహరణ పరిమితి మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుంది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సేవింగ్స్ ప్లస్ అకౌంట్ ట్రాన్సుఫర్ చేయవచ్చు.

ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్‌కు కనీస అర్హత

ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్‌కు కనీస అర్హత

ఎస్బీఐ సేవింగ్స్ ప్లస్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఈ కిందివి అవసరం.

కేవైసీ డాక్యుమెంట్స్. అకౌంట్‌ను ఇండివిడ్యువల్‌గా లేదా జాయింట్‌గా ఓపెన్ చేయవచ్చు. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ కేవలం 2.70 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఎక్కువ వడ్డీ కావాలనుకునే వారి కోసం సేవింగ్స్ ప్లస్ అకౌంట్.

English summary

SBI Savings Plus Account: సేవింగ్స్ ప్లస్ అకౌంట్ గురించి 4 కీలక విషయాలు తెలుసుకోండి | SBI Savings Plus Account: 4 Lesser Known Facts You Need To Know About

In order to overcome emergency or immediate personal finance needs, savings account in your portfolio is a must. Sayings accounts are well known for liquidity in nature, safety of funds, fund transfer facility, interest on the deposit amount, and so on.
Story first published: Friday, July 9, 2021, 20:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X