For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఏడాదిలో రూ.2,00,000కు పైగా రిటర్న్స్!

|

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో ఏడాది క్రితం పెట్టుబడులు పెట్టిన వారికి ఇప్పుడు వంద శాతం రిటర్న్స్ వచ్చాయి. పెట్టుబడులకు రెండింతలు చేతికి వస్తాయి. కరోనా మహమ్మారి కాలంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ కుదుపుకు గురయ్యాయి. అయినా భారీగానే పెరిగాయి. ఇతర బ్యాంకులతో పోలిస్తే SBI అదరగొట్టింది. ఎంతలా అంటే ఏడాది క్రితం మీరు కనుక ఈ బ్యాంకు స్టాక్స్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మీ చేతికి రూ.2 లక్షలు వచ్చేవి. కరోనా కాలంలో కొన్ని స్టాక్స్ అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయి. ఇందులో SBI కూడా ఉంది.

LIC కస్టమర్లకు అలర్ట్: మే 10 నుండి వారానికి 5 రోజులే వర్కింగ్ డేస్LIC కస్టమర్లకు అలర్ట్: మే 10 నుండి వారానికి 5 రోజులే వర్కింగ్ డేస్

ఏడాది క్రితం రూ.100 షేర్లు కొంటే

ఏడాది క్రితం రూ.100 షేర్లు కొంటే

మే 5, 2020 రోజు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో SBI షేర్ ధర రూ.171గా ఉంది. అయితే ఇప్పుడు మే 5, 2021 నాటికి ఈ స్టాక్ ధర రూ.356ను తాకింది. ఈ ఏడాది ఫిబ్రవరి సమయంలో ఈ స్టాక్ రూ.400 కూడా క్రాస్ చేసింది. అయితే ఇటీవల కాలంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా క్షీణించింది.

అయినప్పటికీ ఈ స్టాక్ ఈ ఏడాది కాలంలో రెండింతల కంటే ఎక్కువ రిటర్న్స్ అందించింది. ఏడాది క్రితం ఈ స్టాక్ కొనుగోలు చేసిన వారి చేతికి ఇప్పుడు రెండింతల కంటే ఎక్కువ ఆదాయం వచ్చినట్లే. ఉదాహరణకు ఏడాది క్రితం మే 5 (2020)న SBIకి చెందిన 100 షేర్లు కొనుగోలు చేస్తే రూ.17,100. ఇప్పుడు వాటిని విక్రయిస్తే రూ.35,600గా ఉంటుంది. అంటే రెండింతల కంటే ఎక్కువ.

FD సురక్షితం

FD సురక్షితం

ఇదే కాలంలో SBIలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారికి వచ్చే మొత్తం తక్కువ. ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు ఏడాది కాలపరిమితిపై 4.90 శాతంగా ఉంది. ఇదే మొత్తం FDలో పెట్టుబడి పెడితే వడ్డీ రేటు ప్రకారం కాస్త తక్కువే వస్తుంది. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది పూర్తిగా భద్రం. కానీ షేర్ మాత్రం ఒడిదుడుకులతో కూడుకున్నది. ఈ కాలంలో SBI రెండింతల కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చి ఉండవచ్చు. కానీ ఎంతైనా స్టాక్స్ మాత్రం పూర్తి సురక్షితం కాదు.

నిపుణుల సలహాతో ఇన్వెస్ట్ చేయాలి

నిపుణుల సలహాతో ఇన్వెస్ట్ చేయాలి

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే భారీగా పెరగొచ్చు లేక భారీగా పతనం కావొచ్చు. కాబట్టి మార్కెట్ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి, మార్కెట్ నిపుణుల సలహాలు, సూచనలతో పెట్టుబడులు పెట్టడం మంచిది. స్టాక్ మార్కెట్ రిస్క్‌తో కూడుకున్నది.

English summary

రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఏడాదిలో రూ.2,00,000కు పైగా రిటర్న్స్! | SBI rewarded these people, their money doubled in just 1 year

State Bank of India (SBI), the country's largest government bank, always provides every information to its customers from time to time. Whether it is a way to avoid banking fraud or new updates of the bank. SBI shares every information with its customers through tweet or message. But do you know that this bank is far ahead of many other banks in terms of earning its customers. The stock of this bank has made its customers rich.
Story first published: Friday, May 7, 2021, 8:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X