ఈ స్కిం సామాన్యులకు వరం.. నెలకు వెయ్యితో లక్షాధికారి కావొచ్చు..
ఈ కాలంలో ప్రతి ఒక్కరికీ సేవింగ్స్ చేయడం ముఖ్యం. ఎందుకంటే ఏదైనా అత్యవసర సమయాల్లో డబ్బు అవసరం వచ్చినపుడు ఆర్థిక ఇబ్బందులను ఎదురుకోకుండా ఉండడానికి మీరు చిన్న మొత్తాన్ని సేవింగ్స్ చేసుకుంటూ ఉండాలి. కానీ చాలా మంది పెద్ద మొత్తం సేవింగ్స్ చేయలేకపోతుంటారు. అందుకే చాలా ఎక్కువ శాతం రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్స్ సెలెక్ట్ చేసుకుంటుంటారు. వివిధ బ్యాంకులు కూడా RD స్కీమ్స్ అందిస్తాయి. ఎస్బిఐ బ్యాంక్ అందించే రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో నెలకు 1,000 రూపాయలు డిపాజిట్ చేస్తే మీకు ఎంత లాభం వస్తుంది తెలుసా ?
కనీస పెట్టుబడి: ఎస్బిఐ బ్యాంక్ ఆర్డి స్కింలో కనీస పెట్టుబడి నెలకు రూ.100. మీరు మీ సౌకర్యం ప్రకారం రూ.1000, రూ.5000 లేదా అంతకంటే ఎక్కువ కూడా డిపాజిట్ చేయవచ్చు.

మెచ్యూరిటీ వ్యవధి : ఎస్బిఐ అందించే RD స్కిం మెచ్యూరిటీ వ్యవధి 12 నెలల నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది.
వడ్డీ రేటు: వడ్డీ రేట్లు సాధారణంగా కాలాన్ని బట్టి 6.5 శాతం నుండి 7.5 శాతం మధ్య అందిస్తాయి. మీరు ప్రతినెల పెట్టుబడి పెట్టేటప్పుడు 100 రూపాయల నుండి ఈజీగా పెట్టుబడి పెట్టవచ్చు. దీని ద్వారా సామాన్య ప్రజలు కూడా మెల్లిమెల్లిగా ఆదాయం పెంచుకోవచ్చు. ప్రభుత్వ అందించే బ్యాంకింగ్ స్కిం కాబట్టి, మీ పెట్టుబడులు పూర్తిగా సేఫ్ గా ఉంటాయి.
మీరు SBI అందించే RD స్కీమ్‌లో నెలకు 1000 రూపాయలు పెట్టుబడి పెడితే మీకు ఎంత లాభం వస్తుందంటే మీరు 10 సంవత్సరాల పాటు మొత్తంగా 1,20,000 రూపాయలను 7 శాతం వడ్డీ రేటుతో RD పథకంలో నెలకు 1,000 రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టారు అనుకుందాం. దీనివల్ల వడ్డీ ఆదాయం రూ.53,699 లభిస్తుంది. దీంతో మొత్తం మెచ్యూరిటీ మొత్తం రూ.1,73,699 అవుతుంది.
RD స్కీమ్ ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి చక్రవడ్డీ. మీరు చక్రవడ్డీ ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చు. మీరు మీ RD అకౌంట్లో ఉన్న మొత్తానికి కూడా లోన్ పొందవచ్చు.
మీరు SBI అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయడం ద్వారా కూడా పెట్టుబడి పెట్టవచ్చు. లేదంటే మీరు నేరుగా మీ దగ్గరలోని SBI బ్యాంక్ బ్రాంచ్ వెళ్లి కూడా ఈ స్కింలో పెట్టుబడి పెట్టవచ్చు.


Click it and Unblock the Notifications