స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా(SBI) కస్టమర్లకు అలర్ట్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు శనివారం కొద్ది గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. ఈ సమయంలో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు కూడా నిలిచిపోతాయని ఎస్బీఐ పేర్కొంది. శనివారం అర్ధరాత్రి గం.11.30 నుండి ఆదివారం వేకువజాము గం.4.30 వరకు అంటే ఐదు గంటల పాటు ఈ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఎస్బీఐ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
టెక్నికల్ అప్‌గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా సేవలకు అంతరాయం ఏర్పడుతోందని ఎస్బీఐ పేర్కొంది. మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించే ఈ ప్రయత్నంలో కలుగుతున్న అసౌకర్యానికి సహకరించాలని కస్టమర్లను కోరింది. దేశవ్యాప్తంగా ఎస్బీఐకి 22వేల శాఖలు, 57,889 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. అక్టోబర్ 8న ఇదే తరహాలో మెయింటెనెన్స్‌లో భాగంగా ఎస్బీఐ ఇంటర్నెట్ సేవలకు కొద్దిగంటల పాటు అంతరాయం ఏర్పడింది.

SBI వెబ్ సైట్ ప్రకారం నాలుగో వంతు మార్కెట్ వాటాతో దేశంలో అతిపెద్ద వాటాను కలిగి ఉంది. ఎస్బీఐ తన 11 సబ్సిడరీల ద్వారా వ్యాపారాన్ని వైవిద్యపరిచింది. ఎస్బీఐ జనరల్ ఇన్సురెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, ఎస్బీఐ కార్డ్స్ వంటివి ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని విస్తరించింది. 32 విదేశాల్లో 233 కార్యాలయాల ద్వారా టైమ్ జోన్‌లలో పని చేస్తుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications