ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హోమ్ లోన్ వడ్డీ రేట్లను ఖరారు చేసింది. సొంతింటి కల నెరవేర్చుకునే ఎంతోమంది హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. వారి సిబిల్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంటి రుణం మంజూరు చేస్తుంటాయి. సిబిల్ స్కోర్ 300 నుండి 900 మధ్య త్రీ-డిజిట్ సమ్మరీని బట్టి రేటింగ్, వడ్డీ రేట్లు ఖరారు అవుతాయి. ఎస్బీఐ తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ అందిస్తోంది. మహిళా రుణగ్రహీతలకు అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. 'మీ కలల సొంతింటి సాకారం కోసం ఎస్బీఐ హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోండి' అని ఎస్బీఐ ట్వీట్ చేసింది.

వివిధ హోమ్ లోన్స్
ఎస్బీఐ హోమ్ లోన్ రుణగ్రహీతలకు క్రెడిట్ స్కోర్ లింక్డ్ వడ్డీ రేటు ఉంటుంది. అంటే సిబిల్ స్కోర్ 300 నుండి 900 మధ్య త్రీ డిజిట్ సమ్మరీని బట్టి రేటింగ్, వడ్డీ రేట్లు ఉంటాయి. ఫ్లెక్సీ పే, ఎన్నారై హోమ్ లోన్, నాన్-శాలరైడ్ లోన్, డిఫరెన్షియల్ ఆఫరింగ్, ప్రివిలేజ్, శౌర్య, అప్నా ఘర్ వంటి స్కీమ్‌లలో ఎస్బీఐ హోమ్ లోన్స్ అందిస్తోంది. రెపో రేటును బట్టి ఎస్బీఐ హోమ్ లోన్స్ పైన వడ్డీ రేట్లు ఖరారు అవుతాయి. రెగ్యులర్ హోమ్ లోన్స్, సీఆర్ఈ హోమ్ లోన్స్, టాప్-అప్ లోన్లు, రియాల్టీ లోన్లు, ట్రైబల్ ప్లస్, పీ-లాప్ రుణాలను ఎస్బీఐ ఆఫర్ చేస్తోంది. మహిళా రుణగ్రహీతలకు వడ్డీ రేటులో అయిదు బేసిక్ పాయింట్ల రాయితీ కల్పిస్తోంది. అయితే ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు కనిష్టంగా 6.65 శాతంగా ఉంటుంది.

రుణ అర్హత
ఎస్బీఐ హోమ్ లోన్ పొందడానికి అర్హత ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి. రుణగ్రహీత కనీస వయస్సు 18 ఉండాలి. గరిష్ట వయస్సు 70 ఏళ్లు ఉండాలి. రుణ కాలపరిమితి 30 సంవత్సరాలు.
ఈఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీకు కావాల్సిన రుణ మొత్తం ద్వారా నెలకు ఎంత పడుతుందో తెలుసుకోవచ్చు.

సరసమైన వడ్డీ రేటు
ఎస్బీఐలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.65 శాతంతో కనిష్టం వద్ద ఉంది. హోమ్ లోన్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి సరసమైన వడ్డీ రేటు, చాలా బ్యాంకులతో పోల్చినా తక్కువ వడ్డీ రేటు ఉంది. ప్రాసెసింగ్ ఫీజు కూడా తక్కువగానే ఉంది. హిడెన్ ఛార్జీలు లేవు. ప్రీ-పేమెంట్ పెనాల్టీ ఉండదు. బ్యాలెన్స్ తక్కువ అవుతున్నా కొద్దీ ఇంటరెస్ట్ చార్జీ తగ్గుతుంది. 30 ఏళ్ల గడువు. మహిళా రుణగ్రహీతలకు వడ్డీ రేటులో కన్సెషన్ ఉంది.


Click it and Unblock the Notifications