కొత్త కారు కొనుక్కోవాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. హ్యూందాయ్ క్రెటా కొనుక్కోండి. ఎందుకంటే, దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఈ కారు కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్లు అందిస్తోంది.
క్రెటా ఎందుకులే, కాస్త చిన్న కారు ఏదైనా కొందామని అనుకుంటున్నారా? అలాగైనా గ్రాండ్ ఐ10, ఎలైట్ ఐ20, శాంట్రో, ఎసెంట్, వెర్నా, టస్కన్.. ఇలా హ్యూందాయ్‌లోనే బోలెడు మోడళ్లు ఉన్నాయి. వీటన్నింటిపైనా ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్లు ఇస్తోంది. మరి కారు కొనే ముందు.. వాటి గురించి తెలుసుకోండి.

హ్యూందాయ్ క్రెటాపై ఇదీ ఆఫర్...
‘‘కారు కొనుక్కోవాలనే మీ కలను వెంటనే సాకారం చేసుకోండి. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా హ్యూందాయ్ క్రెట్ 1.6 కారును బుక్ చేసుకోండి.. వివిధ రకాల ప్రయోజనాలను పొందండి. ఈ ఆఫర్ కేవలం 2019 నవంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది..'' అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ట్వీట్ చేసింది.

రూ.80 వేల వరకు ప్రయోజనాలు...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘యోనో' యాప్ ద్వారా హ్యూందాయ్ క్రెటా 1.6 కారును కొనుగోలు చేసిన వారు రూ.80 వేల వరకు వివిధ రకాల ప్రయోజనాలు పొందుతారు. రూ.50 వేల క్యాష్ డిస్కౌంట్‌తోపాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కింద మరో రూ.30 వేల తగ్గింపు పొందవచ్చని ఎస్‌బీఐ తన ఆఫర్‌లో పేర్కొంది.

జీరో ప్రాసెసింగ్ లోన్, వడ్డీ రాయితీ...
ఒకవేళ కారు కొనుగోలుకు మీరు రుణం తీసుకోదల్చుకుంటే ఎస్‌బీఐ ఆ రుణాన్ని అందజేస్తుంది. అర్హత కలిగిన కస్టమర్లు కారు లోన్‌కి సంబంధించి యోనో యాప్ ద్వారానే సూత్రప్రాయ ఆమోదం పొందవచ్చు. పైగా ఇలా తీసుకున్న రుణంపై జీరో ప్రాసెసింగ్ ఫీజు సదుపాయం ఉంది. అంతేకాకుండా కారు రుణం వడ్డీ రేటుపై 0.25 శాతం తగ్గింపు కూడా పొందవచ్చు.

హ్యూందాయ్ ఇతర కార్లపై ఆఫర్లు ఇలా...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తోన్న డిస్కౌంట్ ఆఫర్లు కేవలం ఒక్క హ్యూందాయ్ క్రెటా మోడల్ కారుపైనే కాదు.. ఇంకా వివిధ మోడళ్ల కార్లపై కూడా లభిస్తాయి. గ్రాండ్ ఐ10 మోడల్ కారుపై రూ.75 వేల వరకు ప్రయోజనం పొందవచ్చు. అలాగే ఎలైట్ ఐ20 కారుపై రూ.65 వేల వరకు, వెర్నా మోడల్ కారుపై 60 వేల వరకు, శాంత్రో మోడల్ కారుపై రూ.55 వేల వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇక ఎసెంట్ మోడల్ కారుపై అయితే రూ.95 వేల వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. అంతేకాదు, టస్కన్ మోడల్ కారు మీద అయితే ఏకంగా రూ.2 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు.
ఎస్‌బీఐ ఆఫర్లు పొందడానికి ఏం చేయాలంటే...
హ్యూందాయ్ కార్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్లు పొందాలంటే.. మొదటు ఎస్‌బీఐ యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మీ వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. ఆ తరువాత యాప్‌లో ఎడమవైపు ఉండే ‘షాప్ అండ్ ఆర్డర్' అనే ఆప్షన్‌ను ఎంచుకుని అక్కడ కనిపించే ‘హ్యూందాయ్' ఐకాన్‌పైన క్లిక్ చేయాలి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications