మీరు ఇళ్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? హోమ్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే! ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) గత నెలలో ప్రకటించిన అద్భుతమైన ఆఫర్ రేపటితో ముగియనుంది. హోమ్ లోన్ కావాలనుకునే వారు ఈ లోపు దరఖాస్తు చేసుకుంటే ఆఫర్ వర్తిస్తుంది.
ఆగస్ట్ 31 వరకు అద్భుతమైన ఆఫర్ ఇస్తూ ఎస్బీఐ గత నెలలో ప్రకటన చేసింది. ప్రస్తుతం హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు 0.40 శాతంగా ఉంది. అయితే మాన్‌సూన్ ధమాకా ఆఫర్‌లో భాగంగా హోమ్ లోన్ పైన ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. ఈ ఆఫర్ రేపటి వరకే ఉంటుంది. కాబట్టి త్వరపడటం మంచిది.

హర్రీయప్.. రేపే చివరి రోజు
ప్రస్తుతం SBI హోమ్ లోన్ మొత్తంపై 0.40 శాతం వరకు ఈ ప్రాసెసింగ్ ఫీజును బ్యాంకు వసూలు చేస్తోంది. మాన్‌సూన్ ధమాకా ఆఫర్ పేరుతో ఈ ఛార్జీని పరిమిత కాలంపాటు రద్దు చేస్తున్నట్లు గత నెలలో తెలిపింది. ప్రస్తుతం తమ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు 6.70 శాతమేనని, సొంతిల్లు కోసం చూస్తున్న వారికి ఇప్పుడు మంచి అవకాశంగా SBI అప్పుడే పేర్కొంది. ప్రస్తుతం తమ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు 6.70 శాతంగా ఉన్నాయని, సొంతిల్లు కోసం చూస్తున్న వారికి ఇది మంచి అవకాశంగా ఎస్బీఐ పేర్కొంది.

ప్రాసెసింగ్ రద్దుతో పాటు ఇదీ..
ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేయడం వల్ల రుణాలు తీసుకునే వారి పైన కొంత భారం తగ్గుతుందని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి తెలిపారు. యోనో యాప్ ద్వారా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 0.05 (5 బేసిస్ పాయింట్లు) శాతం వడ్డీ రాయితీని ఇస్తున్నట్లు వెల్లడించారు. మహిళా రుణగ్రహీతలకు కూడా అదనంగా 0.50 శాతం(5 బేసిస్ పాయింట్లు) వడ్డీ రాయితీ కల్పిస్తున్నారు. ప్రస్తుతం రుణ గ్రహీతలు హోమ్ లోన్ పైన 0.40 శాతం ప్రాసెసింగ్ ఫీజును చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేశారు.

మహిళలకు రాయితీ
మహిళా కొనుగోలుదారులకు వడ్డీ రేటు పైన 5 శాతం రాయితీ వర్తిస్తుంది. 'ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇంతకంటే మంచి సమయం ఉండదని, ఎందుకంటే వడ్డీ రేటు ఇప్పుడు ఏకంగా 6.70 శాతం నుండి ప్రారంభమవుతోందని' ఎస్బీఐ తన ప్రకటనలో తెలిపింది. హోమ్ లోన్ పైన ఎస్బీఐ వడ్డీరేటు చారిత్రక స్థాయిలో తక్కువగా ఉంది. జాతి నిర్మాణంలో భాగస్వాములుగా ఇంటి కొనుగోళ్లను ప్రోత్సహించడానికి ఈ రాయితీ అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్బీఐ తెలిపింది. మరిన్ని వివరాల కోసం ఎస్బీఐ వెబ్ సైట్ నుండి తెలుసుకోవచ్చు.
కాగా, హోమ్ లోన్ తీసుకుంటే హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ ఉంటుంది. హోమ్ లోన్ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికేట్ అంటారు. ఎస్బీఐ ఆన్ లైన్ బ్యాంకింగ్ లేదా ఎస్బీఐ క్విక్ ద్వారా హోమ్ లోన్ ఇంటరెస్ట్ కాపీని సులభంగా పొందవచ్చు. మీరు రుణాలు తీసుకున్న బ్యాంకు లేదా సంస్థ హోమ్ లోన్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఆదాయపు పన్ను చెల్లింపులో మినహాయింపు కోసం హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ అవసరం.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications