SBI మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీం: వడ్డీ రేటు, అర్హత ఇదీ
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తమ కస్టమర్లకు మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీం(MODS)ను అందిస్తోంది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగా ఉంటుంది. ఇలాగే మీకు అవసరమైనప్పుడు డబ్బులు ఉపసంహరించుకోవచ్చు. ఇది పొదుపు లేదా కరెంట్ అకౌంట్‌తో అనుసంధానించి ఉంటుంది. కస్టమర్లు మెచ్యూరిటీకి ముందుగానే డబ్బులు ఉపసంహరించుకోవచ్చు. అకౌంట్లోని డబ్బులకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఎస్బీఐ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీం గురించి కొన్ని విషయాలు ఇక్కడ...

ఖాతాకు వర్తించే కాలపరిమితి
ఎస్బీఐ MODS ఖాతాను ఓపెన్ చేసేందుకు అవసరమైన కనీస టర్మ్ డిపాజిట్ మొత్తం రూ.10,000. ఎస్బీఐ MODS ఖాతాకు గరిష్ట టర్మ్ డిపాజిట్ మొత్తంపై పరిమితి లేదు. MODSఖాతా వడ్డీ రేటు, టర్మ్ డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేటుకు సమానంగా ఉంటుంది. సాధారణ కస్టమర్లకు ఎస్బీఐ ఎఫ్డీ వడ్డీ రేట్లు 2.9 శాతం నుండి 5.4 శాతం మధ్య ఉంటాయి. ఈ రేట్లు జనవరి 8, 2021 నుండి అమలులోకి వచ్చాయి. MODS ఖాతాకు వర్తించే కాలపరిమితి కనిష్టంగా ఒక సంవత్సరం నుండి గరిష్టంగా అయిదేళ్లు.

ముందస్తు ఉపసంహరణ
ఎస్బీఐ MODS అకౌంట్ ముందస్తు ఉపసంహరణల్ని అనుమతిస్తుంది. రూ.5 లక్షల వరకు FDకి, ముందస్తు ఉపసంహరణ అన్ని కాలపరిమితులకు గాను జరిమానా 0.50 శాతంగా ఉంటుంది. రూ.5 లక్షల కంటే ఎక్కువ నుండి రూ.1 కోటి కంటే తక్కువ ఉన్న FDలకు వర్తించే జరిమాన్ అన్ని కాలపరిమితులకు ఒక శాతంగా ఉంటుంది. వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా, మైనర్, కంపెనీలు, లోకల్ బాడీస్, ఏదైనా ప్రభుత్వ విభాగం ఎస్బీఐ MODS ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఈ పథకానికి TDS వర్తిస్తుంది.

ఖాతా ఇలా తెరువొచ్చు
ఎస్బీఐ MODS ఖాతాలో రుణ సౌకర్యం అందుబాటులో ఉంది. ఎస్బీఐ MODS ఖాతాకు నామినేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఆన్ లైన్ ఎస్బీఐ ద్వారా లేదా మీ సమీప బ్యాంకు శాఖను సందర్శించడం ద్వారా MODS ఖాతాను తెరువవచ్చు.


Click it and Unblock the Notifications