ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు అద్భుతమైన షాపింగ్ కార్నివాల్‌ను ప్రకటించింది. ఆదివారం (ఏప్రిల్ 4వ తేదీ) నుండి నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. యోనో యాప్ ఆధారిత ఈ-షాపింగ్ కార్నీవాల్‌ను అకౌంట్ హోల్డర్లు ఉపయోగించుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా ఎస్బీఐ ఈ కార్నీవాల్‌కు యోనో సూపర్ సేవింగ్ డేస్ అని పేరు పెట్టింది. ఇది మూడో ఎడిషన్ యోనో సూపర్ సేవింగ్ డేస్. ఈ నాలుగు రోజుల పాటు ఎస్బీఐ బ్యాంకింగ్, లైఫ్ స్టైల్ ప్లాట్‌ఫాం ద్వారా మంచి డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నట్లు తెలిపింది.

ఎప్పటి నుండి ఎప్పటి వరకు
ఎస్బీఐ యోనో సూపర్ సేవింగ్ డేస్ ఆఫర్ నేడు (ఆదివారం) ప్రారంభమై, ఏడో తేదీన ముగుస్తుంది. తమ ఖాతాదారులు ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ లైఫ్ స్టైల్ ప్లాట్‌ఫామ్ యోనో ద్వారా వివిధ రకాల డిస్కౌంట్ల్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. ఈ ఏడాదిలో ఎస్బీఐ షాపింగ్ కార్నివాల్‌ను అందుబాటులోకి తీసుకు రావడం ఇది మూడోసారి. ఇంతకుముందు గత నెలలో నాలుగో తేది నుండి ఏడో తేదీ వరకు ఈ ఆఫర్ ఇచ్చింది.

వాటితో జట్టు
ఆదివారం నుండి నాలుగు రోజుల పాటు సాగే యోనో షాపింగ్ సూపర్ సేవింగ్స్ డేస్ కార్నీవాల్‌లో ఖాతాదారులు ప్రయాణం, ఆతిథ్యం, హెల్త్, ఆన్‌లైన్ షాపింగ్స్‌లో ఉత్తమ సేవలు అందుకోవచ్చు. 3.6 కోట్ల మంది ఖాతాదారులకు సేవలు అందించే లక్ష్యంతో ఎస్బీఐ ఈ షాపింగ్ కార్నీవాల్‌ను నిర్వహిస్తోంది. ఇందుకు ఎస్బీఐ యోనో యాప్ పలు టాప్ మర్చంట్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అమెజాన్, అపోలో, ఓయో, ఈజీ మై ట్రిప్, ఎట్ హోమ్ వంటి సంస్థలతో జత కట్టింది.

డిస్కౌంట్
హోటల్ బుకింగ్, ఫ్లయిట్ బుకింగ్, హెల్త్ కేటగిరీల్లో బుకింగ్స్ పైన 50 శాతం, అమెజాన్‌లో ఎంపిక చేసిన కేటగిరీ వస్తువులను కొనుగోలు చేస్తే పది శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఎస్బీఐకి దేశవ్యాప్తంగా 22000 వేలకు పైగా బ్రాంచీలు ఉన్నాయి. 58,000కు పైగా ఏటీఎం, సీడీఎం నెట్ వర్క్ సెంటర్స్ ఉన్నాయి. మొత్తం బీసీ ఔట్ లెట్స్ 71000కు పైగా ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications