న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తమ జన్ ధన్ అకౌంట్ హోల్డర్స్ ఎస్బీఐ రూపే జన్ ధన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే వారు ప్రమాద కవరేజీని రూ.2 లక్షల వరకు పొందవచ్చునని తెలిపింది. ఈ ప్రయోజనం కోసం తమ కస్టమర్లు రూపే జన్ ధన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY) గ్రామీణ, పట్టణ, గృహాల కవరేజీ పైన దృష్టి సారించింది. PMJDY బ్యాంకింగ్, సేవింగ్స్, డిపాజిట్ ఖాతాలు, చెల్లింపులు, క్రెడిట్, బీమా, పెన్షన్ వంటి ఆర్థిక సేవలను సులభతరం చేస్తుంది. PMJDY ఖాతాలకు సగటు నెలవారీ బ్యాలెన్స్‌ను మినహాయించినట్లు ఎస్బీఐ వెల్లడించింది.

జన్ ధన్ అకౌంట్ ప్రయోజనాలు
జన్ ధన్ అకౌంట్‌తో ఉచిత మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటుంది.
అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆరు నెలలకు ఓవర్సీస్ సౌకర్యం ఉంది.
ప్రమాద బీమా పాలసీ రూ.2 లక్షలు
లైఫ్ కవర్ రూ.30,000 వరకు
ఖాతాదారుకు రూపే డెబిట్ కార్డు ఇస్తారు.
డిపాజిట్ పైన వడ్డీ వస్తుంది.
దేశవ్యాప్తంగా మనీ ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు.
ఈ అకౌంట్ ద్వారా ఇన్సురెన్స్, పెన్షన్ ఉత్పత్తులు సులభంగా కొనుగోలు చేయవచ్చు.
ఖాతా తెరిచిన ఆరు నెలల తర్వాత, అర్హత ప్రమాణాలకు లోబడి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అనుమతిస్తారు.

జన్ ధన్ ఖాతా ఎవరికి
పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన వారు ఎవరైనా జన్ ధన్ ఖాతా తెరువొచ్చు. పొదుపు ఖాతాను కూడా జన్ ధన్ యోజన ఖాతాకు బదలీ చేసుకోవచ్చు.
PMJDY ఓపెన్ చేసేందుకు ఆధార్ కార్డు లేదా ఆధార్ నెంబర్ కలిగిన రుజువు అందుబాటులో ఉంటే ఇతర డాక్యుమెంటేషన్ అవసరం లేదు.
ఆధార్ కార్డు లేకుంటే ఓటరు ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు, ఎన్ఆర్ఈజీఏ కార్డు అవసరం.

41.75 కోట్ల ఖాతాలు
PMJDY కింద మొత్తం 41.75 కోట్ల ఖాతాలు తెరిచారు. అందులో 35.96 కోట్ల ఖాతాలు పని చేస్తున్నాయి. లోకసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయం తెలిపారు.


Click it and Unblock the Notifications