ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి ఓ శుభవార్త. ఎస్బీఐ వివిధ రకాల సేవలు అందిస్తోంది. భారతీయులు ఎవరైనా 18 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఎస్బీఐ ఇన్‌స్టా సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ తెరవవచ్చు. బ్యాంకుతో ఇది వరకు ఎలాంటి సంబంధం లేని వారికి మాత్రం ఇది వర్తిస్తుంది. ఆధార్ కార్డు నెంబర్, పాన్ నెంబర్, ఆధార్ రిజిస్ట్ర్డ్ మొబైల్ నెంబర్, ఈ -మెయిల్ ఐడీ ఉంటే అకౌంట్ తెరవవచ్చు.

ఒకరి పేరుపై అకౌంట్
కస్టమర్లు ఇతర బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల్లో ఓటీపీ ఆధారిత వెరిఫికేషన్ అకౌంటును కలిగి ఉండవద్దు. అలాగే కస్టమర్లు ఇతర బ్యాంకు అకౌంట్లను కలిగి ఉండకూడదు. ఎలాంటి కారణం చెప్పకుండానే మీ అకౌంట్ రిక్వెస్టును రిజెక్ట్ చేసే అధికారం ఎస్బీఐకి ఉంది. ఒకరి పేరుపై మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.

గరిష్టంగా...
ఒక ట్రాన్సాక్షన్ పైన గరిష్టంగా రూ.49,999 వరకు పరిమితి ఉంది. ఎస్బీఐ బ్రాంచీలలో క్యాష్ ట్రాన్సాక్షన్లను నిర్వహించలేం. యోనో యాప్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు. ఎస్బీఐ ఇన్ స్టా సేవింగ్ అకౌంట్లో గరిష్టంగా రూ.లక్ష వరకు బ్యాలెన్స్ కలిగి ఉండవచ్చు. ఏడాదిలో క్రెడిట్స్ వ్యాల్యూ రూ.2 లక్షలు మించవద్దు.

స్టేట్‌మెంట్
ఇన్ స్టా అకౌంట్ కలిగి ఉన్న వారు ఏడాదిలోపు బ్రాంచీకి వెళ్లి రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్‌గా మార్చుకునే వెసులుబాటు ఉంది. బేసిక్ రూపే కార్డు ఇస్తారు. ఆడియో-విజువల్ స్టేట్ మెంట్ ఈ-మెయిల్ ద్వారా వస్తుంది. కస్టమర్లు ఒకరిని మాత్రమే నామినీగా ఎంచుకోవచ్చు. పాస్ బుక్, చెక్ బుక్ ఉండదు. బ్రాంచీకి లేఖ రాసి అకౌంట్ క్లోజ్ చేయవచ్చు. ఏడాదిలోపు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకుంటే క్లోజ్ అవుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications