ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) హోమ్ లోన్ పైన ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. ఇది ఆగస్ట్ చివరి నాటికి రుణాలు తీసుకునే వారికి వర్తిస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం హోమ్ లోన్ మొత్తంపై 0.40 శాతం వరకు ఈ ప్రాసెసింగ్ ఫీజును బ్యాంకు వసూలు చేస్తోంది. మాన్‌సూన్ ధమాకా ఆఫర్ పేరుతో ఈ ఛార్జీని పరిమిత కాలంపాటు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం తమ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు 6.70 శాతమేనని, సొంతిల్లు కోసం చూస్తున్న వారికి ఇప్పుడు మంచి అవకాశంగా ఎస్బీఐ పేర్కొంది. ప్రస్తుతం తమ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు 6.70 శాతంగా ఉన్నాయని, సొంతిల్లు కోసం చూస్తున్న వారికి ఇది మంచి అవకాశంగా ఎస్బీఐ పేర్కొంది.

యోనో యాప్ ద్వారా రాయితీ
ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేయడం వల్ల రుణాలు తీసుకునే వారి పైన కొంత భారం తగ్గుతుందని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి తెలిపారు. యోనో యాప్ ద్వారా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 0.05 (5 బేసిస్ పాయింట్లు) శాతం వడ్డీ రాయితీని ఇస్తున్నట్లు వెల్లడించారు. మహిళా రుణగ్రహీతలకు కూడా అదనంగా 0.50 శాతం(5 బేసిస్ పాయింట్లు) వడ్డీ రాయితీ కల్పిస్తున్నారు. ప్రస్తుతం రుణ గ్రహీతలు హోమ్ లోన్ పైన 0.40 శాతం ప్రాసెసింగ్ ఫీజును చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేశారు.

మరిన్ని వివరాల కోసం...
హోమ్ లోన్ పైన ఎస్బీఐ వడ్డీరేటు చారిత్రక స్థాయిలో తక్కువగా ఉంది. జాతి నిర్మాణంలో భాగస్వాములుగా ఇంటి కొనుగోళ్లను ప్రోత్సహించడానికి ఈ రాయితీ అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్బీఐ తెలిపింది. మరిన్ని వివరాల కోసం ఎస్బీఐ వెబ్ సైట్ నుండి తెలుసుకోవచ్చు.

హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్
హోమ్ లోన్ తీసుకుంటే హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ ఉంటుంది. హోమ్ లోన్ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికేట్ అంటారు. ఎస్బీఐ ఆన్ లైన్ బ్యాంకింగ్ లేదా ఎస్బీఐ క్విక్ ద్వారా హోమ్ లోన్ ఇంటరెస్ట్ కాపీని సులభంగా పొందవచ్చు. మీరు రుణాలు తీసుకున్న బ్యాంకు లేదా సంస్థ హోమ్ లోన్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఆదాయపు పన్ను చెల్లింపులో మినహాయింపు కోసం హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ అవసరం.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications