డెట్ కేటగిరీలో ఫిక్స్డ్ డిపాజిట్స్(FD) పెట్టుబడులను స్వల్ప, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఎంచుకోవచ్చు. రిస్క్ తక్కువ కోరుకునే వారికి, సీనియర్ సిటిజన్స్‌కు ఫిక్స్డ్ డిపాజిట్ సురక్షితమైన ఎంపిక. డెట్ ఇన్వెస్టర్ ఏడు రోజుల నుండి పదేళ్ల కాలపరిమితిపై ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని జమ చేయడం ద్వారా ఏడాది ప్రాతిపదికన వడ్డీ రేటును కూడా పొందవచ్చు. అయితే ఇండివిడ్యువల్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి ముందు ప్రముఖ భారతీయ బ్యాంకులు, పోస్టాఫీస్ అందించే వారి పెట్టుబడి హారిజోన్, వడ్డీ రేట్లను పరిగణలోకి తీసుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు విషయానికి వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియా పోస్ట్ వడ్డీ రేట్లను ఇక్కడ చూడండి.

SBI వడ్డీ రేటు
కనీస డిపాజిట్ మొత్తం రూ.1000తో ప్రారంభించవచ్చు. అలాగే ప్రతి నెల 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలపరిమితికి గాను ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. ఖాతాదారు టర్మ్ డిపాజిట్ పైన వడ్డీని త్రైమాసికానికి లేదా మెచ్యూరిటీ సమయంలో జారీ చేసిన తేదీ నుండి, ప్రధాన మొత్తంతో సహా పొందుతాడు. పన్నెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన టర్మ్డిపాజిట్స్ విషయంలో వడ్డీని నెలవారీగా, అర్ధ సంవత్సరం వారీగా లేదా ప్రతి సంవత్సరం చెల్లించవచ్చు. ఈ అకౌంట్‌ను ఒక బ్రాంచీ నుండి మరో బ్రాంచీకి మార్చుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం ద్వారా టీడీఎస్ తప్పనిసరి. కాబట్టి డిపాజిటర్ ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం పన్ను మినహాయింపును పొందడానికి 15G/15H ఫాంను దాఖలు చేయవచ్చు. ఎస్బీఐ 08.01.2021 తన ఫిక్స్డ్ డిపాజిట్స్ వడ్డీ రేట్లను సవరించింది.
- 7 days to 45 days రెగ్యులర్ వడ్డీ రేటు 2.9%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.4%,
- 46 days to 179 days రెగ్యులర్ వడ్డీ రేటు 3.9%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.4%,
- 180 days to 210 days రెగ్యులర్ వడ్డీ రేటు 4.4%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.9%,
- 211 days to less than 1 year రెగ్యులర్ వడ్డీ రేటు 4.4%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.9%,
- 1 year to less than 2 year రెగ్యులర్ వడ్డీ రేటు 5%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.5%,
- 2 years to less than 3 years రెగ్యులర్ వడ్డీ రేటు 5.1%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.6%,
- 3 years to less than 5 years రెగ్యులర్ వడ్డీ రేటు 5.3%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.8%,
- 5 years and up to 10 years రెగ్యులర్ వడ్డీ రేటు 5.4%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.2%.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్
సింగిల్ అకౌంట్, జాయింట్ అకౌంట్ (ముగ్గురు అడల్ట్స్ వరకు) తీయవచ్చు. పదేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ పైన అకౌంట్ తీయవచ్చు. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్‌ను కనీస మొత్తం రూ.1000 ప్రారంభంతో తీయవచ్చు. రూ.100 (X) మొత్తాన్ని ఏడాది నుండి అయిదేళ్ల కాలానికి డిపాజిట్ చేయవచ్చు. అయిదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ పైన సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఇండియా పోస్ట్ టైమ్ డిపాజిట్స్ తాజా వడ్డీ రేట్లు...
- 1yr.A/c వడ్డీ రేటు 5.50%,
- 2yr.A/c వడ్డీ రేటు 5.50%.
- 3yr.A/c వడ్డీ రేటు 5.5%,
- 5yr.A/c వడ్డీ రేటు 6.7%.

ఎందులో ఇన్వెస్ట్ చేయాలి?
ప్రస్తుతం టర్మ్ డిపాజిట్స్ పైన బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేటు ఉంది. కాబట్టి దీర్ఘకాలానికి గాను ప్రస్తుతం ఇక్కడ పెట్టుబడి అధిక రాబడిని ఇవ్వలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎస్బీఐ వడ్డీ రేటు అయిదేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితికి 5.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఎస్బీఐ FD డిపాజిట్ ఖాతా నుండి వచ్చే ఆదాయంపై పూర్తిగా ఆధారపడితే ద్రవ్యోల్భణం 5.94 శాతం నుండి 6.1 శాతం మధ్య ఉంటే మీ రాబడి సున్నాగా ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్ డిపాజిట్ కోసం అయితే ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ రేటు అందించే పోస్టాఫీస్ స్కీంకు వెళ్లడం సముచితంగా చెబుతున్నారు. ఇవి కాకుండా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలో పెట్టుబడి పెట్టవచ్చు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం, ప్రధానమంత్రి వయవందన యోజన వంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక్కడ వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications