అదిరిపోయే వడ్డీ రేటు, వారికి SBI మరోసారి గుడ్‌న్యూస్ అందించింది

దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కరోనా సమయంలో గతేడాది మే నెలలో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంను ప్రవేశపెట్టింది. దీనిని ఎస్బీఐ వీకేర్ సీనియర్ సిటిజన్స్ స్కీమ్(SBI Wecare Senior Citizens Scheme) అంటారు. ఇది భారతీయ సీనియర్ సిటిజన్లకు మంచి వడ్డీ రేటుతో మంచి పెట్టుబడి అవకాశాన్ని అందించేందుకు ఉద్దేశించిన టర్మ్ డిపాజిట్ స్కీం. ఎస్బీఐ వకేర్ సీనియర్ సిటిజన్స్ స్కీంను ప్రభుత్వం ఇప్పుడు మరోసారి పొడిగించింది. దీనిని 2022 మార్చి వరకు పొడిగించింది.

ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూర్చేందుకు, ఎస్బీఐ ఈ పథకం వ్యవధిని వరుసగా ఐదోసారి పెడిగించింది. ఈ పథకం కింద ఇతర వడ్డీ రేట్లతో పోలిస్తే అదనపు వడ్డీ రేటు ఉంటుంది.ఈ మేరకు ఎస్బీఐ ఈ పొడిగింపుకు సంబంధించి అధికారిక సమాచారం ఇచ్చింది. 'ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ ఫర్ సీనియర్ సిటిజన్స్ స్కీంను పొడిగిస్తున్నాం.

సాధారణ వడ్డీ రేటుతో పోలిస్తే ఇందులో 30 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటు ఉంటుంది. ఈ స్కీం పరిమితిని మార్చి 31, 2022 వరకు పొడిగిస్తున్నాం' అని బ్యాంకు ప్రకటనలో తెలిపింది. టర్మ్ డిపాజిట్ పైన ఎక్కువ వడ్డీ రేటు కచ్చితంగా స్కీమ్ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రయోజనం చేకూరుతుందని, ఈ స్కీం రెన్యూవల్ చేసుకున్న వారికి, కొత్త వారికి అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

0.80 శాతం వడ్డీ రేటు అదనం

0.80 శాతం వడ్డీ రేటు అదనం

ఎస్బీఐ వీకేర్ సీనియర్ సిటిజన్స్ FD పథకంపై వడ్డీ రేటు 30 బేసిస్ పాయింట్లు అదనంగా లభిస్తుంది. అయిదేళ్ల కాలపరిమితి, అంతకంటే ఎక్కువ కాలపరిమితి పథకాన్ని తీసుకున్న సబ్‌స్క్రైబర్లకు అదనపు వడ్డీ రేటు అందిస్తామని తెలిపింది. ఎస్బీఐ సాధారణ వడ్డీ రేటు అయిదేళ్ల కాలపరిమితిపై 5.40 శాతంగా ఉంది. కానీ ఈ సీనియర్ సిటిజన్ స్పెషల్ ఎఫ్‌డీ స్కీం కింద బ్యాంకు 6.20 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అందుకే ఎస్బీఐ వీకేర్ సీనియర్ సిటిజన్స్ FD స్కీం కింద, ఒక సీనియర్ సిటిజన్ అదనంగా 0.80 శాతం వడ్డీ రేటును పొందుతారు.

వడ్డీ రేట్లు

వడ్డీ రేట్లు

SBI వీకేర్ స్కీంలో 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కన్నా తక్కువ కాలపరిమితిపై వడ్డీ రేటు 5.50%,

2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కన్నా తక్కువ కాలపరిమితిపై 5.60%,

3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కన్నా తక్కువ కాలపరిమితిపై 5.80%,

5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ 10 సంవత్సరాల కాలపరిమితిపై వడ్డీ రేటు 6.20%గా ఉంది.

5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాల పరిమితిపై ఈ పథకం అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది.

సీనియర్ సిటిజన్లు రూ.2 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్స్ పైన ఈ వడ్డీ రేటును పొందుతారు.

అయితే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ (SCSS) వడ్డీ రేటు కూడా ఆకర్షణీయంగానే ఉంది. ఇది అయిదేళ్ల కాలపరిమితి కలిగిన స్కీం.

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు

సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం SBI బ్యాంకు We Care ప్ర‌త్యేక డిపాజిట్ స్కీంను ప్రారంభించింది. అయిదేళ్లు అంత‌కంటే ఎక్కువ కాల‌ప‌రిమితితో ఈ స్కీంలో డిపాజిట్ చేసిన సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు సాధార‌ణంగా వ‌ర్తించే వ‌డ్డీ రేటు కంటే 30 బేసిస్ పాయింట్లు అదనంగా ఉంటుంది. రెగ్యులర్‌గా వ‌ర్తించే వడ్డీ రేటు కంటే 80 బేసిస్ పాయింట్ల అద‌న‌పు వ‌డ్డీ రేటు ఉంటుంది. ప్ర‌స్తుతం, ఎస్బీఐ సాధార‌ణ వడ్డీ రేటు అయిదేళ్ల కాలపరిమితిపై 5.4 శాతంగా ఉంది. సీనియ‌ర్ సిటిజ‌న్ ప్ర‌త్యేక FD స్కీంలో చేరితో 6.20 శాతం వడ్డీ ఉంటుంది.

HDFC బ్యాంకు HDFC సీనియ‌ర్ సిటిజ‌న్ కేర్ పేరుతో స్పెష‌ల్ FD స్కీంను సీనియర్ సిటిజన్స్ కోసం అందుబాటులోకి తెచ్చింది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు సాధార‌ణంగా ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే 25 బేసిస్ పాయింట్లు అదనంగా ఉంటుంది. ఈ స్కీం ద్వారా రెగ్యులర్ వడ్డీ రేటు కంటే 75 బేసిస్ పాయింట్లు అధికంగా అందిస్తోంది. ఈ డిపాజిట్స్ పైన వర్తించే వ‌డ్డీ రేటు 6.25 శాతం.

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా స్పెషల్ FD స్కీం డిపాజిట్స్ పైన 100 బేసిస్ పాయింట్లు అధిక వ‌డ్డీ రేటును అందిస్తోంది. ప్ర‌త్యేక FD ప‌థ‌కం కింద (అయిదు సంవ‌త్స‌రాల నుండి పది సంవ‌త్స‌రాల వ‌ర‌కు) ఒక సీనియ‌ర్ సిటిజ‌న్ ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే, FDకి వ‌ర్తించే వ‌డ్డీ రేటు 6.25 శాతం ఉంటుంది.

ICICI బ్యాంకు గోల్డెన్ ఇయర్స్ పేరుతో సీనియర్ సిటిజన్ ప్రత్యేక FD స్కీంను తీసుకు వచ్చింది. సాధారణ వడ్డీ రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకం ద్వారా అందించే ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 6.30 శాతంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+