SBI digital security guidelines: హ్యాకర్స్ బారిన పడకుండా ఇలా చేయండి
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి కీలక గైడ్ లైన్స్‌ను కస్టమర్లకు అందించింది. ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలు పెద్ద ఎత్తున జరుగుతోన్న విషయం తెలిసిందే. అలాంటి డిజిటల్ మోసాలు చేసే హ్యాకర్స్ బారిన తమ కస్టమర్లు పడకుండా ఉండేందుకు కీలక సూచనలు చేసింది. ఇందుకు పాటించతగిన సూచనలను విడుదల చేసింది. సురక్షితమైన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కోసం ఎస్బీఐ విడుదల చేసిన జాగ్రత్తలు ఈ కింద చూద్దాం...

లాగ్-ఇన్ సెక్యూరిటీ
- సురక్షితమైన లాగ్-ఇన్ కోసం ప్రత్యేకమైన, క్లిష్టమైన పాస్ వర్డ్‌ను ఎంచుకోవాలి.
- పాస్ వర్డ్‌ను తరుచూ మారుస్తుండాలి.
- ఐడీ, పాస్ వర్డ్, పిన్ వంటి వివరాలను ఎవరికీ ఇవ్వవద్దు. ఎక్కడ కూడా రాసిపెట్టుకోవడం చేయరాదు. ఎక్కడా సేవ్ చేయవద్దు.
- బ్యాంకు మిమ్మల్ని ఎప్పుడు కూడా యూజర్ ఐడీ, పాస్ వర్డ్, కార్డు నెంబర్, పిన్న, సీవీవీ, ఓటీపీ వంటి వివరాలను అడగదు.
- మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో దానంతట అదే పాస్ వర్డ్‌ల వంటి కీలక వివరాలను సేవ్ చేసుకునే ఆటో సేవ్, రిమెంబర్ వంటి ఆప్షన్లను డిజబుల్ చేయాలి.

ఇంటర్నెట్ సెక్యూరిటీ
- బ్యాంకు వెబ్ సైట్ అడ్రస్‌బార్‌లో కచ్చితంగా https ఉండాలి.
- ఓపెన్ వై-ఫై నెట్ వర్క్ ద్వారా పబ్లిక్ ప్రాంతాల్లో ఆన్ లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించవద్దు.
- లాగ్-ఇన్ అయి, పని పూర్తయ్యాక లాగ్-ఔట్ కావాలి.

యూపీఐ సెక్యూరిటీ
- మొబైల్ పిన్, యూపీఐ పిన్ వేరుగా ఉండేలా చూసుకోవాలి.
- అపరిచిత యూపీఐ రిక్వెస్ట్‌లపై స్పందించవద్దు.
- నకిలీ రిక్వెస్ట్‌లను సంబంధిత వ్యవస్థల దృష్టికీ తీసుకు వెళ్లాలి.
- కేవలం నగదు బదలీకి మాత్రమే పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. రిసీవ్ చేసుకోవడానికి అవసరం లేదనే విషయం గుర్తుంచుకోవాలి.
- మీ ప్రమేయం లేకుండా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినట్లు గుర్తిస్తే వెంటనే మీ ఖాతాలో యూపీఐ సేవలను డిజబుల్ చేయాలి.

డెబిట్/క్రెడిట్ కార్డు సెక్యూరిటీ
- ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్(PoS) వద్ద ట్రాన్సాక్షన్స్ జరిపేటప్పుడు చుట్టుపక్కల పరిసరాలను నిశితంగా పరిశీలించాలి.
- పిన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు కీప్యాడ్‌ను కవర్ చేయాలి.
- ఈ-కామర్స్ వెబ్ సైట్లు ఎంత వరకు నిజమైనవో తెలుసుకోవాలి.
- డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్‌ను ఆన్ లైన్ బ్యాంకింగ్‌కు అనుసంధానం చేయాలి.
- ఏటీఎం, పీవోఎస్, ఈ-కామర్స్ సైట్లలో ట్రాన్సాక్షన్‌కు పరిమితిని విధించాలి.

మొబైల్ బ్యాంకింగ్ సెక్యూరిటీ
- మొబైల్ బ్యాంకింగ్ సెక్యూరిటీ క్లిష్టంగా ఉండాలి. మీ ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్‌లో బయోమెట్రిక్ పర్మిషన్ ఎనబుల్ అయి ఉండాలి.
- మీ మొబైల్ పిన్ నెంబర్‌ను ఎవరితోను షేర్ చేయవద్దు.
- సాధ్యమయ్యే చోట బయోమెట్రిక్ అథెంటికేషన్ వినియోగించాలి.
- అధికారిక స్టోర్ నుండి మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలి.
- మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన క్లిష్టమైన యాప్స్ అనుమతులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. ఉపయోగించని యాప్స్‌ను ట్రాక్ చేయాలి.

సోషల్ మీడియా సెక్యూరిటీ
- మీరు ఇంటరాక్ట్ అవుతున్న వ్యక్తి గుర్తింపును నిర్ధారించుకోవాలి.
- మీ వ్యక్తిగత/ఆర్థిక పరమైన సమాచారాన్ని ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లోను పంచుకోవద్దు.
- బహిరంగ ప్రదేశాల్లో, ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో మీ కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని చర్చించవద్దు.
- ఎస్బీఐ సోషల్ సామాజిక ఖాతాలో యాక్టివ్‌గా ఉంటుంది. కస్టమర్ల భద్రత, సురక్షిత ట్రాన్సాక్షన్ నిమిత్తం బ్యాంకులు ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేస్తాయి.


Click it and Unblock the Notifications


