ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వడ్డీరేటు తగ్గిస్తూ తమ కస్టమర్లకు తీపి కబురు అందించిన విషయం తెలిసిందే. అన్ని కాలపరిమితుల రుణాలపై బెంచ్ మార్క్ వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 7.40 శాతంగా ఉన్న వడ్డీ రేటును 7.25 శాతానికి సవరించింది. ఇది ఆదివారం (మే 10) తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ఎస్బీఐ వరుసగా పన్నెండోసారి వడ్డీ రేటు తగ్గించింది. గతంలో ఆర్థిక మందగమనం, ఇప్పుడు కరోనా కారణంగా వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి.

ఎంసీఎల్ఆర్ లింక్డ్ రుణాలపై తగ్గించినా...
ఎంసీఎల్ఆర్ లింక్డ్ హోమ్ లోన్స్ పైన వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో ఓ వ్యక్తి 30 ఏళ్లలో తీర్చే విధంగా రూ.25 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే అతని నెల ఈఎంఐ పైన రూ.255 భారం తగ్గుతుంది. ఎంసీఎల్ఆర్ పైన తగ్గించిన బ్యాంకు బాహ్య బెంచ్ మార్క్ రెపో రేట్ ఆధారిత హోమ్ లోన్స్ వడ్డీ రేటును కొత్త వారికి 30 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.

ఈ హోమ్ లోన్ వడ్డీ రేటు మాత్రం భారం
ఎస్బీఐ రెపో రేటు ఆధారిత గృహరుణాల వడ్డీరేట్లను 20 నుండి 30 బేసిస్ పాయింట్స్ వరకు పెంచింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రుణగ్రహీతలకు, రియాల్టీ సంస్థలకు రుణ సమస్యలు పెరుగుతాయని మార్కెట్ నుంచి సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ చెబుతోందట. ఆస్తి తనఖాపై ఇచ్చే వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లను కూడా 30 బేసిస్ పాయింట్స్ పెంచినట్లు తెలిపింది.

రెపో రేటు లింక్డ్‌పై పెంపు
ఎస్బీఐ ఎక్కువ హోమ్ లోన్స్‌ను రెపో రేట్ లేదా ఎంసీఎల్ఆర్ ఆధారంగా ఇస్తుంది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత వడ్డీ రేటును 7.05 శాతం వద్ద స్థిరంగా ఉంచినప్పటికీ వివిధ రకాల హోమ్ లోన్స్ పైన వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్స్ పెంచింది. కొత్త వడ్డీ రేట్లను ఈ నెల 1వ తేదీ నుంచే అమల్లోకి తీసుకొచ్చినట్టు ఎస్బీఐ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఇలా పెరుగుదల
రెపో రేటు ఆధారిత హోమ్ లోన్ వడ్డీ రేటు పెరిగినందున... రూ.30 లక్షల వరకు తీసుకున్న హోమ్ లోన్స్ పైన ఇప్పటి వరకు ఉన్న 7.20 శాతం వడ్డీ రేటు 7.40 శాతం అవుతుంది.
రూ.30 లక్షల నుండి రూ.7 లక్షల వరకు లోన్ ఇది వరకు రూ.7.45 శాతం ఉండగా మే 1వ తేదీ నుండి 7.65 శాతం అవుతుంది.
రూ.75 లక్షలకు పైన హోమ్ లోన్ తీసుకుంటే ఇదివరకు 7.55 శాతం నుండి 7.75 శాతానికి పెరిగింది.
ఇక తనఖాపై ఇచ్చే హోమ్ లోన్ పైన 8.90 శాతం నుండి 9.20 శాతానికి పెరిగింది.

డిపాజిట్లపై వడ్డీ రేటు తగ్గింపు, వృద్ధులకు గుడ్ న్యూస్
మరోవైపు, మూడేళ్ల కాలపరిమితి రిటైల్ డిపాజిట్లపై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఎస్బీఐ. మే 12వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది.
రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఎస్బీఐ వి-కేర్ డిపాజిట్ పథకం ప్రారంభించింది. ఇటీవలి కాలంలో వడ్డీ రేట్లు భారీగా తగ్గిపోయాయి. దీంతో వృద్ధులకు ఊరటను ఇచ్చేందుకు దీనిని ప్రారంభించింది. అయిదేళ్ళు, ఆ పైన కాలపరిమితికి సీనియర్ సిటిజన్లు చేసే డిపాజిట్లపై సాధారణ వడ్డీ కంటే 30 బేసిస్ పాయింట్స్ అదనపు ప్రీమియం వ్డీ చెల్లిస్తుంది. అయితే ఈ స్కీం సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications