SBI Customers Alert: ఎస్బీఐ నగదు ఉపసంహరణలో బిగ్ చేంజ్
ATM కేంద్రాల వద్ద మోసాలను నివారించేందుకు ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఓటీపీ ఆధారిత విధానాన్ని తీసుకు వచ్చింది. తమ కస్టమర్లకు సౌకర్యంగా ఉండేందుకు, ఫ్రాడ్‌స్టర్స్ బారిన పడకుండా ఉండేందుకు ఈ సౌకర్యాన్ని తెచ్చింది. ఈ కొత్త ఫీచర్ ఎస్బీఐ కస్టమర్లను అనధికారిక ఏటీఎం నగదు ఉపసంహరణ నుండి కాపాడుతుంది. 'ఎస్బీఐ ఏటీఎంలలో ట్రాన్సాక్షన్స్ కోసం ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థ మోసగాళ్లకు చెక్ చెప్పడానికే. చీటర్స్ నుండి కస్టమర్లను రక్షించడం మా బాధ్యత' అని ట్వీట్ చేసింది.
2020లో ఎస్బీఐ మోసపూరిత ట్రాన్సాక్షన్స్‌ను తగ్గించేందుకు ఓటీపీ చెల్లుబాటు అయ్యే ఏటీఎం ట్రాన్సాక్షన్‌ను ప్రవేశపెట్టిందని గుర్తు పెట్టుకోవాలి. ఎస్బీఐ ప్రవేశపెట్టిన కొత్త మార్పులో భాగంగా కస్టమర్స్ వారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ట్రాన్సాక్షన్‌ను ప్రామాణీకరించేందుకు అవసరమైన, సరైన ఓటీపీని నమోదు చేసిన తర్వాతనే కస్టమర్ ఏటీఎం నుండి నగదును ఉపసంహరించుకోవచ్చు. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. కస్టమర్లు ఈ సదుపాయాన్ని మరో బ్యాంకు ఏటీఎంలో ఉపయోగించుకోలేరు. మోసపూరిత ట్రాన్సాక్షన్స్ పెరగడంతో ఇతర బ్యాంకులు కూడా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించడానికి ఓటీపీ ఆధారిత ధృవీకరణ ప్రక్రియను అమలు చేయవచ్చు.

- ఈ విధానంలో ఎస్బీఐ ఏటీఎంల వద్ద నగదు ఉపసంహరణ చేసేందుకు ఓటీపీ అవసరం.
- అకౌంట్ హోల్డర్ బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ అనేది నాలుగంకెల సంఖ్య. ఒకసారి వచ్చిన ఓటీపీ ఒక ట్రాన్సక్షన్‌కు మాత్రమే పని చేస్తుంది.
- ఏటీఎంలో కార్డు ఇన్‌సర్ట్ చేసి, డెబిట్ కార్డు పిన్ నెంబర్, ఉపసంహరణ మొత్తాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలని అడుగుతుంది.
- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తేనే క్యాష్ వస్తుంది.


Click it and Unblock the Notifications