Mutual Funds: దేశీయంగా రిటైల్ ఇన్వెస్టర్ల డబ్బులు ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలోకి మళ్లుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ మాత్రం పెట్టుబడిదారుల తలరాతను మార్చేస్తున్నాయి. వేలల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి కోట్లలో రాబడిని తెచ్చిపెడుతున్నాయి.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది కాంట్రా మ్యూచువల్ ఫండ్ గురించి. వాస్తవానికి ఈ ఫండ్స్ దేశీయ స్టాక్ మార్కెట్ల పనితీరుకు వ్యతిరేకంగా పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తులకు సరైన ఎంపిక. ఇవి తక్కువ విలువ కలిగిన మంచి రాబడి అవకాశం ఉండే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అందుకే ఇవి ప్రజల్లో మంచి ఆదరణను పొందాయి. దేశంలో మెుదటిగా స్టార్ట్ అయిన కాంట్రా ఫండ్ SBI Contra Fund. ఇది జూలై 1999లో ప్రారంభించబడింది.

ఎవరైనా ఇన్వెస్టర్ ఈ స్కీమ్ కింద ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.10,000 ప్రతినెల SIP రూపంలో పెట్టుబడిని కొనసాగించినట్లయితే వారు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.7.19 కోట్ల రాబడిని పొందేవారు. ఈ ఫండ్ ఎక్స్‌టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 20.84 శాతంగా ఉంది. వివిధ కాల వ్యవధిలో జరిగే బహుళ లావాదేవీలతో పెట్టుబడులపై రాబడిని లెక్కించడానికి ఉపయోగించే ఒక పద్ధతి. ఎస్బీఐ కాంట్రా ఫండ్, BSE 500 TRIలను పోల్చి చూస్తే మెరుగైన రాబడిని అందించింది. SBI కాంట్రా ఫండ్ 19.99 శాతం రిటర్న్ అందించింది.
ఎస్బీఐ కాంట్రా ఫండ్ మూడేళ్లలో 34.25 శాతం, ఏడాదిలో 48.68 శాతం SIP రాబడిని అందించింది. ఎస్బీఐ కాంట్రా ఫండ్‌ను ప్రారంభించే సమయంలో ఒక పెట్టుబడిదారుడు ఒకేసారి రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే జూన్ 28 నాటికి వారి పెట్టుబడి విలువ రూ.95.3 లక్షలకు పెరిగి ఉండేది. ప్రస్తుతం ఈ ఫండ్ కింద మెుత్తం రూ.34,366 కోట్ల విలువైన పెట్టుబడులు ఉండగా దీనిలో 20.5 లక్షల కంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు రిజిస్టర్ అయి ఉన్నారు. ఎవరైనా ఇన్వెస్టర్ దీర్ఘకాలంలో ఉత్తమమైన రాబడి కోసం పెట్టుబడులు పెడుతున్నట్లయితే అలాంటి వారికి ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న ఈ SBI మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఉత్తమ రాబడిని అందించింది.


Click it and Unblock the Notifications