ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఎస్బీఐ ఏటీఎం కమ్ డెబిట్ కార్డులపై ప్రమోషనల్ ఆఫర్ ఇస్తోంది. ఎస్బీఐ డెబిట్ కార్డు ఆఫర్ మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డు ఉపయోగిస్తున్న కస్టమర్లకు వర్తిస్తుంది. ఎస్బీఐ ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ ఉన్న వినియోగదారులకు ట్రాన్సాక్షన్ మొత్తంలో 1 శాతం క్యాష్ బ్యాక్ అందుతుంది. అన్ని ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ సేల్ (POS) మిషన్లు, ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్స్‌కు ఇది వర్తిస్తుంది. ఈ ఆఫర్ నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు రెండు నెలల పాటు వర్తిస్తుంది. ఇక మరో నెల పదిహేను రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఎవరికి వర్తిస్తుంది.. ఎవరికి వర్తించదు
ఇండియన్ సిటిజన్స్ అందరికీ, 18 ఏళ్ల వయస్సు నిండి ఉన్న వారికి ఈ డెబిట్ కార్డు పైన క్యాష్ ఆఫర్ స్కీం వర్తిస్తుంది. వీరి వద్ద ఎస్బీఐ మాస్టర్ కార్డ్ ఈఎంవీ చిప్ డెబిట్ కార్డు ఉండాలి. ఎస్బీఐ, మాస్టర్ కార్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు, ఎస్బీఐ ఏజెంట్స్ వంటి వారికి ఈ ప్రమోషనల్ ఆఫర్ వర్తించదు. ఎస్బీఐ లేదా మాస్టర్ కార్డ్‌తో అసోసియేట్ అయిన ఉద్యోగులు, వారి ఫ్యామిలీ మెంబర్స్‌కు కూడా ఈ 1 శాతం ఆఫర్ వర్తించదు.

కార్పోరేట్ కార్డు కస్టమర్లకు నో
భారతదేశం వెలుపల.. అంటే విదేశాల్లో క్యాష్ బ్యాక్ ఆఫర్ POS మిషన్స్, ఇతర కొనుగోళ్లకు వర్తిస్తుంది. కార్పోరేట్ కార్డు కలిగి ఉన్న కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించదు. ఎస్పీఐ నిర్దేశించిన మినిమం ట్రాన్సాక్షన్ అమౌంట్ పైన క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది.

ఎంత... వీరికి మాత్రమే..
1 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందాలంటే ఎస్బీఐ మాస్టర్ కార్డుతో ఇంటర్నేషనల్ POS, ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్స్ కనీసం 500 డాలర్లుగా ఉండాలి. ఎస్బీఐ క్యాష్ బ్యాక్‌ను సెలెక్టెడ్ కస్టమర్లకు రూ.2,500గా పేర్కొంది. ఇక్కడ మరో విషయం ఉంది. క్యాంపెయిన్ సమయంలో టాప్ 15,000 స్పెండర్స్‌కు మాత్రమే క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications