ఎస్బీఐ కార్డ్స్ ఫిట్‌నెస్, హెల్త్ ఔత్సాహికుల కోసం సరికొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. ఎస్బీఐ కార్డ్ పల్స్ (SBI Card PULSE) పేరుతో ఫిట్‌నెస్, ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలను అందించే కార్డును తొలిసారి ప్రారంభించింది. ఈ కాంటాక్ట్‌లెస్ కార్డ్ వార్షిక ఫీజు రూ.1499. వీసా సిగ్నేచర్ ప్లాట్‌ఫాం పైన దీనిని ప్రారంభించింది. యాన్యువల్ స్పెండింగ్ మైల్ స్టోన్ రూ.2 లక్షలను చేరుకుంటే వార్షిక ఫీజు (రూ.1499) నుండి మినహాయింపు ఉంటుంది. ఎస్బీఐ కార్డ్ పల్స్ కస్టమర్లకు జాయినింగ్ ఫీజు చెల్లింపుపై వెల్ కామ్ గిఫ్ట్‌గా రూ.4999 వ్యాల్యూ కలిగిన నాయిస్ కలర్ ఫిట్ పల్స్ స్మార్ట్ వాచ్‌ను అందిస్తోంది. దేశవ్యాప్తంగా కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని, కార్డు హోల్డర్ ఆరోగ్యం పట్ల చురుకైన విధానంతో ప్రత్యేక ఫీచర్లు, ప్రయోజనాలతో కార్డును రూపొందించారు.

4000కు పైగా జిమ్స్, ఫిట్‌నెస్ స్టూడియోలు
నాయిస్ కలర్ ఫిట్ పల్స్ స్మార్ట్ వాచ్ 1.4 అంగుళాల ఫుల్ కలర్ డిస్‌ప్లే, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ (SPO2), స్లీప్ మానటరింగ్ సహా పలు ఫీచర్స్‌ను కలిగి ఉంది. ఎస్బీఐ కార్డ్ పల్స్ కస్టమర్స్ భారత్ అంతటా 4000 ప్లస్ జిమ్స్, ఫిట్‌నెస్ స్టూడియోలకు క్యూరేటెడ్ నెట్ వర్క్ యాక్సెస్‌ను కలిగి ఉన్నారు. యోగా, డ్యాన్స్, కార్డియో, పైలేట్స్, మరెన్నో అపరిమిత ఆన్ లైన్ ఫిట్ నెస్ సెషన్స్‌ను పొందవచ్చు.

ఎస్బీఐ కార్డ్ పల్స్
- వెల్‌కమ్ బెనిఫిట్- ఈ కార్డును తీసుకుంటే రూ.4999 విలువైన నాయిస్ కలర్ ఫిట్ పల్స్ స్మార్ట్ వాచ్.
- జాయినింగ్ యాక్టివేషన్ బెనిఫిట్స్ - ఫిట్‌పాస్ ప్రో కాంప్లిమెంటరీ వన్ ఇయర్ మెంబర్‌షిప్. ఇందులో ఫిట్‌పాస్ మెంబర్‌షిప్ ఉంటుంది. 4000 ప్లస్ జిమ్స్, ఫిట్‌నెస్ కేంద్రాలు.
- నెలకు 12 ఫిట్‌నెస్ సెషన్స్ పరిమితి. వారానికి మూడు సెషన్లు. రోజుకు ఒక సెషన్.
- ఫిట్ కోచ్ అండ్ ఫిట్ ఫీస్ట్ మెంబర్‌షిప్
- ఫిట్‌నెస్ కోచింగ్ రొటీన్స్, FITPASS పైన అందుబాటులో ఎక్స్‌పర్ట్ న్యూట్రిషనిస్ట్.

అప్లికేషన్
- నెట్‌మేడ్ ఫస్ట్ మెంబర్‌షిప్ ఏడాది కాంప్లిమెంటరీ.
- ఏడాదికి అన్-లిమిటెడ్ ఆన్ లైన్ డాక్టర్ కన్సల్టేషన్
- యాన్యువల్ బేసిక్ హెల్త్ చెకప్.
- ప్రతి ప్రీపెయిడ్ ఆఫర్ పైన అదనంగా 2.5 శాతం (రూ.100 వరకు) ఎన్ఎంఎస్ క్యాష్.
- పాథాలజీ ల్యాబ్ టెస్టుల పైన అదనంగా 5 శాతం తగ్గింపు.
- అన్-లిమిటెడ్ ఉచిత, ప్రియారిటీ డెలివరీ.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications