SBI Card: ఎస్బీఐ కార్డు నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు..!
పండుగ సీజన్‌కు ముందు ఎస్‌బిఐ కార్డ్ బుధవారం నాడు ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఆధారపడిన ఒక కొత్త సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు ఫిజికల్ పేపర్లు సమర్పించకుండా, ఎస్‌బిఐ యోనో (SBI YONO) ప్లాట్‌ఫామ్ ద్వారా డిజిటల్‌గా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్వాంటేజ్ ఎస్‌బిఐ కార్డును పూర్తిగా ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ద్వారా పొందవచ్చు. దీనికి దాదాపు 10 నిమిషాల సమయం పడుతుంది. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై జారీ చేస్తారు. ఇది రుణ సౌకర్యానికి భద్రతగా పనిచేస్తుంది. ఎస్‌బిఐలో ఎఫ్‌డి (FD) నిర్వహిస్తున్న వినియోగదారులకు ఎస్‌బిఐ కార్డ్ ఈ ఆఫర్ ఇచ్చింది.
ఈ కార్డు ఎఫ్‌డిపై భద్రతతో కూడిన రుణ సౌకర్యాల కోసం చూస్తున్న వినియోగదారుల కోసం రూపొందించారు. ఈ కార్డు వినియోగదారులకు అధికారిక రుణాన్ని పొందడానికి ఉపయోగపడనుంది. సెక్యూర్డ్ కార్డ్ ఆఫరింగ్ కింద, కస్టమర్లు నాలుగు ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఇందులో ఎస్‌బిఐ కార్డ్ ఎలైట్, ఎస్‌బిఐ కార్డ్ ప్రైమ్, సింప్లీక్లిక్ ఎస్‌బిఐ కార్డ్, సింప్లీసేవ్ ఎస్‌బిఐ కార్డులు ఉన్నాయి. కస్టమర్లు ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆధారిత కార్డుల కోసం నేరుగా ఎస్‌బిఐ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలైట్, ప్రైమ్ ప్రీమియం కార్డ్ ఆప్షన్‌లుగా ఉండగా, సింప్లీక్లిక్ ఆన్‌లైన్ షాపింగ్ ప్రయోజనాలను ఇష్టపడే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంది, అయితే సింప్లీసేవ్ రోజువారీ ఖర్చు, పొదుపు సంబంధిత ప్రయోజనాల కోసం రూపొందించారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఖాతా ఉన్న కస్టమర్లు, SBI యోనో (SBI YONO) యాప్ ద్వారా సెక్యూర్డ్ అడ్వాంటేజ్ SBI కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ సాధారణ అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ కంటే భిన్నంగా ఉంటుంది. సాంప్రదాయ క్రెడిట్ కార్డు విషయంలో బ్యాంక్ సాధారణంగా ఆదాయం, తిరిగి చెల్లింపు చరిత్ర, క్రెడిట్ స్కోర్, ఇతర అర్హత ప్రమాణాల వంటి అంశాల ఆధారంగా కస్టమర్, క్రెడిట్ పరిమితిని నిర్ణయిస్తారు. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ విషయంలో వినియోగదారుడు తన ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను సెక్యూరిటీగా అందిస్తాడు. ఆ FDకి బదులుగా బ్యాంకు క్రెడిట్ కార్డును జారీ చేస్తుంది.
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (CIR) అనేది వివిధ రుణదాతల నుంచిిచ స్వీకరించిన సమాచారం ఆధారంగా రూపొందిస్తారు. రుణగ్రహీత క్రెడిట్ చెల్లింపుల చరిత్రకు సంబంధించిన ఒక వాస్తవ రికార్డు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సమాచారంతో కూడిన రుణ నిర్ణయాలు త్వరగా, నిష్పక్షపాతంగా తీసుకోవడంలో సహాయపడనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సాధారణ ప్రజల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 3.05 శాతం నుంచి 6.25 శాచం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం బ్యాంకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి గల FDలపై 3.55 శాతం నుంచి 7.05 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
