ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు KYC ఫ్రాడ్‌పై హెచ్చరికలు జారీ చేసింది. కరోనా సంక్షోభ సమయంలో సైబర్ నేరస్తులు పరోక్షంగా మీ వద్దకు వచ్చి మరీ మీ సొమ్మును కాజేస్తున్నారని, ఇలాంటి ఫ్రాడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ ట్వీట్ చేసింది. గత కొంతకాలంగా కేవైసీ పేరుతో సైబర్ నేరస్తులు బ్యాంకు అకౌంట్ నుండి డబ్బులను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని బ్యాంకు ఖాతాదారులను హెచ్చరించింది.

కస్టమర్లకు అవగాహన
'ప్రియమైన కస్టమర్లకు, మీ ఎస్బీఐ ఖాతా కేవైసీ కోసం సస్పెండ్ చేయబడింది. దయచేసి ఈ లింక్ పైన క్లిక్ చేసి, మీ కేవైసీని పది నిమిషాల్లో పూర్తి చేయండి' అని మీకు పర్సనల్ నెంబర్ ద్వారా ఎస్సెమ్మెస్ వస్తే, ఇది కేవైసీ మోసం అని తెలుసుకోవాలి అని ట్వీట్ చేసింది. కేవైసీ మోసం గురించి ఎస్బీఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కేవైసీ మోసం గురించి కస్టమర్లకు అవగాహన పెంచే ప్రయత్నం చేసింది.

ఎంబెడేడ్ లింక్స్ పైన క్లిక్ చేయవద్దు
ఇతర నెంబర్ ద్వారా కేవైసీ ఫ్రాడ్ జరుగుతుందని, గుర్తింపులేని ఎస్సెమ్మెస్‌ల ద్వారా ఫ్రాడ్ జరుగుతుందని, అప్పుడు మీరు మీ అకౌంట్ నుండి డబ్బును కూడా కోల్పోవచ్చునని, కాబట్టి గుర్తు తెలియని ఎంబేడెడ్ లింక్స్ పైన క్లిక్ చేయవద్దని కస్టమర్లకు సూచించింది. ఎస్సెమ్మెస్‌ను రిసీవ్ చేసుకుంటే ఎస్బీఐ యొక్క సరైన షార్ట్ కోడ్‌ను చెక్ చేయాలి. ఎస్బీఐతో సురక్షితంగా ఉండండి అని పేర్కొంది.

ఎస్బీఐ ఎప్పుడు అడగదు
ఎస్బీఐ ఎప్పుడు కూడా ఎంబెడెడ్ చేసిన లింక్ పైన క్లిక్ చేసి, మీ కేవైసీని అప్ డేట్ లేదా కంప్లీట్ చేయమని అడగదు అని ఎస్బీఐ తెలిపింది. మరో ట్వీట్‌లో ఓటీపీ షేరింగ్‌కు సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా ఫ్రాడ్ స్టర్స్ ఓటీపీ అడిగితే రాంగ్ నెంబర్ అని చెప్పి ముగించండి అని పేర్కొంది.


Click it and Unblock the Notifications