Banking News: చాలా మంది ప్రస్తుత కాలంలో డిజిటల్ చెల్లింపులు సర్వసాధారణ విషయంగా మారిన వేళ బ్యాంకింగ్ సేవలను విరివిగా వినియోగిస్తున్నారు. రోజువారీ ట్రాన్సాక్షన్ల నుంచి డబ్బు డిపాజిట్ వరకు అనేక పనులను ప్రజలు పూర్తి చేస్తున్నారు. అయితే అసలు డబ్బు డిపాజిట్లకు సంబంధించి చాలా మందికి రూల్స్ అస్సలు తెలియదు.
ప్రస్తుతం ప్రజలు ఇతరులను నమ్మి వడ్డీలకు డబ్బు ఇవ్వటం మానుకున్నారు. ఈ క్రమంలో చేతిలో ఉండే అధిక మెుత్తాలను తమ సేవింగ్స్ అకౌంట్ల ద్వారా కొంత కాలానికి డిపాజిట్ చేసి మంచి రాబడులను అందుకోవాలని చూస్తున్నారు. పైగా ఇందులో డబ్బుకు పూర్తి భద్రతతో పాటు సులభంగా అవసరమైనప్పుడు తిరిగి తీసుకునేందుకు వెసులుబాటు ఉండటాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. అయితే బ్యాంకుల్లో కష్టపడి సంపాదించిన డబ్బు డిపాజిట్ చేయటానికి ముందు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. డిపాజిట్ చేసేముందు బ్యాంకులకు సంబంధించిన నిబంధనలు అర్థం చేసుకోకపోతే అవి ఆర్థికంగా నష్టాలను కలిగిస్తాయి. ఇవి జరిమానాల నుంచి తీవ్రమైన పన్ను సమస్యల వరకు అనేక ఇబ్బందులను కలిగించవచ్చు.

అందువల్ల బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసే ముందు సామాన్యులు అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకోవటం తప్పనిసరి. ముందుగా బ్యాంకుల్లో నిర్ణీత మొత్తానికి మించి డిపాజిట్ చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని పత్రాలను అందించాలి. అలా చేయని పక్షంలో డిపాజిట్ చేసిన సొమ్ముపై దాదాపు 60 శాతం వరకు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 25% సర్‌ఛార్జ్, 4% సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ సదరు వ్యక్తులు ఆదాయానికి సంబంధించిన వనరుల వివరాలను వెల్లడించకపోతే పన్ను అధికారులు నోటీసులను జారీ చేయటంతో పాటు 60 శాతం పన్ను విధించే అవకాశం ఉంటుంది.
ఇలా జరగకుండా ఉండాలంటే బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలకు సంబంధించిన రూల్స్ గమనించాలి. ఖాతాదారులు ఏడాదిలో రూ.10 లక్షల కంటే ఎక్కువ మెుత్తాన్ని తమ సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ చేసినప్పుడు సదరు అదాయానికి సంబంధించిన వివరాలు ప్రకటించాల్సి ఉంటుంది. ఆ డబ్బు ఏ మార్గంలో వచ్చింది, ఎందుకు వచ్చిందనే వివరాలు తప్పక పేర్కొనాలి. ఇక కరెంట్ అకౌంట్ విషయానికి వస్తే డిపాజిట్ పరిమితి ఏడాదికి రూ.50 లక్షలుగా నిర్ణయించబడింది. రుజువులు లేకుండా నేరుగా 60 శాతం పన్ను శాఖ కట్ చేస్తుందని గమనించాలి. వాస్తవానికి ఈ రూల్స్ తీసుకురావటానికి అసలు కారణం.. అనైతిక కార్యకలాపాలను అడ్డుకోవటం. పన్ను ఎగవేతలను కంట్రోల్ చేయటం, మనీలాండరింగ్ నిరోధించటం, అక్రమ ఆర్థిక లావాదేవీలను నివారించటంగా పన్ను అధికారులు చెబుతున్నారు. నమ్మదగిన రుజువును చూపిస్తే మాత్రం ఖాతాల్లో ఎంతైనా డబ్బు జమచేయవచ్చు అలాగే ఆ మెుత్తాలకు పన్ను రిటర్న్స్ ఫైల్ కూడా చేయాల్సి ఉంటుంది.
సాధారణ బ్యాంక్ వినియోగదారులు ఒకేసారి తమ సేవింగ్స్ ఖాతాలో రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ మెుత్తాన్ని డిపాజిట్ చేయాలనుకుంటే అందుకు వారి పాన్ వివరాలను తప్పనిసరిగా పంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ముందుగా పేర్కొన్న విధంగా ఏడాదికి ఖాతాలో గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పరిమితులకు మించి ఖాతాల్లో జరిగే ట్రాన్సాక్షన్ల వివరాలను బ్యాంకులు ఎప్పటికప్పుడు పన్ను అధికారులతో పంచుకుంటాయి.
దీనికోసం ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేయబడింది. అవసరానికి మించి ఉండే డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయటం వల్ల భద్రతతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి. రూ.5 లక్షల వరకు చేసే డిపాజిట్లకు.. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(DICGC) హామీని ఇస్తుంది. ఒకవేళ బ్యాంక్ దివాళా తీసినప్పటికీ పెట్టుబడిదారులకు రూ.5 లక్షల వరకు చేసిన డిపాజిట్ల డబ్బు తిరిగి చెల్లించబడుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications