పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా PPF పథకం... పెట్టుబడిదారులకు ఆకర్షణీయ రాబడిని అందించే అత్యంత సురక్షిత పెట్టుబడుల్లో ఒకటి. అయితే మీరు మీ చిన్న పెట్టుబడులను పెద్ద మొత్తానికి మార్చాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు మీ డబ్బును పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లయితే కాస్త ఓపిక వహించాలి. దీర్ఘకాలిక పెట్టుబడిదారుల కోసం, పెట్టుబడి ద్వారా కోటీశ్వరులుగా మారడం కోసం పీపీఎఫ్ ఓ మంచి సాధనం. అయితే దీనికి పెద్ద ఎత్తున సహనం అవసరం. ఒక ఇన్వెస్టర్ ఏడాదికి రూ.1.5 లక్షల చొప్పున ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే, నెలకు రూ.12,500 అవుతుంది. లాంగ్ టర్మ్‌లో ఇది పెద్ద మొత్తంలో చేతికి వస్తుంది. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది.

అలా రూ.1 కోటి దాటవచ్చు
పీపీఎఫ్ రిస్క్‌లేని పెట్టుబడి సాధనం. ఇందులో కనీసం పదిహేనేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. నెలకు రూ.12500 చొప్పున పదిహేను సంవత్సరాలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తర్వాత ఇది రూ.40,68,209 అవుతుంది. అంటే మీరు రోజుకు రూ.416 ఇన్వెస్ట్ చేస్తున్నట్లు. మీరు చేసిన మొత్తం పెట్టుబడి రూ.22.5 లక్షలు కాగా, దీనిపై వడ్డీ రేటు రూ.18,18,209 వస్తుంది. అంటే రూ.18 లక్షలు అదనపు మొత్తం.
అయితే మెచ్యూరిటీ తర్వాత ఈ మొత్తాన్ని తీసుకోవడానికి బదులు, అలాగే కొనసాగిస్తే కనుక కోటీశ్వరులు కావొచ్చు. మెచ్యూరిటీ తర్వాత అయిదేళ్ల పాటు అలాగే కొనసాగిస్తే రూ.66,58,288, ఆ తర్వాత మరో అయిదేళ్లు కొనసాగిస్తే (అంటే మొత్తం 25 ఏళ్లు, మెచ్యూరిటీ వరకు 15, ఆ తర్వాత 10.. మొత్తం 25 ఏళ్లు) ఆ మొత్తం రూ.1,03,08,015 అవుతుంది.

25 ఏళ్లలో కోటీశ్వరులు
అంటే మీరు నెలకు రూ.12500 మొత్తం చెల్లించడం ద్వారా ఇరవై ఐదు సంవత్సరాలలో మీ పెట్టుబడి, వడ్డీ రేటు కలుపుకొని కోటీశ్వరులు కావొచ్చు. దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహంతో ఉన్నవారు ఎవరైనా పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం సురక్షితం, ప్రయోజనకరం. ప్రతి సంవత్సరం రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 80సి సెక్షన్ కింద పన్ను మినహాయింపు ఉంటుంది.

పథకం వివరాలు క్లుప్తంగా...
- నెలవారీ ప్రీమియం రూ.12,500,
ఏడాదికి రూ.1.50 లక్షలు,
పదిహేను సంవత్సరాలలో రూ.22.50 లక్షలు మీరు చెల్లించిన మొత్తం,
మెచ్యూరిటీ పదిహేను సంవత్సరాలు,
వార్షిక వడ్డీ రేటు ప్రస్తుతం 7.1 శాతం,
మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం రూ.40.70 లక్షలు,
ఇందులో వడ్డీ ప్రయోజనం రూ.18.20 లక్షలు.
అలాగే, ఇరవై అయిదేళ్ల వరకు కొనసాగిస్తే, ఈ కాలంలో మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ.37.50 లక్షలు, వార్షిక వడ్డీ రేటు 7.1 శాతం, పాతికేళ్ల తర్వాత రూ.1.03 కోట్లు చేతికి వస్తాయి. వడ్డీ ప్రయోజనం రూ.62.50 లక్షలు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications