దేశంలోని సెంట్రల్ బ్యాంకులు సాధారణంగా బంగారాన్ని రిజర్వ్ ఆస్తిగా నిల్వ చేసుకుంటున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వెండిని కూడా నిల్వ చేసుకుంటాయా.. అంటే లేదనే చెప్పవచ్చు. తాజాగా సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం ఈ ధోరణిని మార్చే సూచనలు ఇస్తోంది. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (CFP) కీర్తన్ ఎ. షా లింక్డ్ఇన్‌లో చేసిన ఒక పోస్ట్‌లో ఈ పరిణామాన్ని ప్రస్తావించారు. సౌదీ సెంట్రల్ బ్యాంక్ నిశ్శబ్దంగా వెండిలో స్థానం సంపాదించడం యాదృచ్ఛికం కాదు. ఇది రాబోయే కాలంలో బంగారం-వెండి సమతౌల్యంపై కొత్త దృష్టి కోణాన్ని తెచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వెండి కేవలం ఆభరణాల లోహం మాత్రమే కాదు, నేటి పారిశ్రామిక రంగంలో అది అనివార్యంగా చెప్పుకోవచ్చు. దీనిని ఎలక్ట్రానిక్స్ తయారీలో వాడతారు. అలాగే.. 5G మౌలిక సదుపాయాలతో పాటుగా సౌర ఫలకాలు, ఎలక్ట్రిక్ వాహనాలు (బ్యాటరీలు, ఛార్జింగ్ సిస్టమ్స్, సెన్సార్లు) అలాగే సెమీకండక్టర్ తయారీ మరియు డేటా సర్వర్ కూలింగ్ వంటి విభాగాల్లో వెండి కీలక పాత్ర పోషిస్తోంది. సిల్వర్ ఇన్స్టిట్యూట్ తాజా వరల్డ్ సిల్వర్ సర్వే 2025ప్రకారం.. వెండి మార్కెట్ వరుసగా నాలుగో సంవత్సరం సరఫరా లోటుతో కొనసాగుతోంది. 2024లో మాత్రమే సుమారుగా 4,600 టన్నుల లోటు నమోదైంది. అంతేకాక.. గని ఉత్పత్తి 2026లో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా. దీంతో వెండి మార్కెట్లో నిర్మాణాత్మక కొరత మరింత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక అంతర్జాతీయ మార్కెట్లో 2025లో వెండి ధరలు 40 శాతం కంటే ఎక్కువ పెరుగుదల సాధించి ఔన్సుకు 40 డాలర్ల వద్దకు చేరుకున్నాయి. అదే సమయంలో బంగారం ఇంకా సురక్షితమైన ఆస్తిగా కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో వెండి వేగవంతమైన లాభాలు ఇస్తుండగా బంగారం సురక్షిత స్వర్గధామం గా తన స్థానాన్ని నిలుపుకుంటోంది.
పెట్టుబడిదారుల దృష్టిలో ఇప్పుడు బంగారం, వెండి రెండు వేర్వేరు పాత్రలు పోషిస్తున్నాయి. వెండి వేగంగా పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలకు మూలం కావడంతో దూకుడు లాభాలను ఇస్తోంది. మరోవైపు బంగారం ఆర్థిక అస్థిరతకు రక్షణగా నిలుస్తోంది. కీర్తన్ షా సూచన ప్రకారం, పోర్ట్‌ఫోలియోలో బంగారానికి సుమారు ఎనిమిది శాతం, వెండికి కనీసం 15 శాతం కేటాయిస్తే పెట్టుబడిదారులకు స్థిరత్వం మరియు వృద్ధి రెండూ లభిస్తాయి.
సౌదీ సెంట్రల్ బ్యాంక్ Silver లో చేసిన ఈ అడుగు చిన్నదిగా కనిపించినప్పటికీ, దీని ప్రభావం పెద్దదిగా ఉండే అవకాశం ఉంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రిజర్వ్ ఆస్తుల రూపకల్పనలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. రాబోయే దశాబ్దంలో పారిశ్రామిక విప్లవానికి వెండి ఇంధనం అవుతుందని, కానీ బంగారం మాత్రం శాశ్వత భద్రతా కవచంలా తన స్థానాన్ని కొనసాగిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications