మీరు 2025 లో మీ జీతంపైనే బతుకుతున్నారా? అలా అయితే ఇది పెద్ద రిస్క్. 2025లో జీతాల పెరుగుదల తగ్గిపోవడం, మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగిపోవడం వల్ల భారతీయ కుటుంబాలు, ముఖ్యంగా మెట్రో నగరాల్లో నివసించే వారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్యాప్‌ను భర్తీ చేయకపోతే, ఎప్పుడూ జీతం కోసం పరుగెత్తే రేసులోనే ఇరుక్కుపోతారు.

ఎక్కువమంది ఉద్యోగులు ఇప్పటికీ తమ జీతంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే, జీతాల పెరుగుదల తగ్గిపోయింది. దీనివల్ల ప్రతి నెలా వచ్చే పెరుగుదల కన్నా ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయి. చాలా కుటుంబాలు "ఎంత సంపాదించినా సరిపోవడం లేదు" అనే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
ముంబై, బెంగళూరు,హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై వంటి మెట్రో నగరాల్లో జీవించడం చాలా ఖరీదైన వ్యవహారం. కేవలం రెంట్, ఆహారం, రవాణా, మొబైల్ బిల్లులు వంటి ప్రాథమిక అవసరాలకే పెద్ద మొత్తంలో డబ్బు వెళ్తోంది. ఉదాహరణకు, ముంబైలో ఒక కుటుంబం నెలకి రూ.30,000 నుంచి రూ. 60,000 వరకూ ఖర్చు అవుతుంది. బెంగళూరులో ఇది రూ. 20,000 నుంచి రూ. 40,000 వరకూ ఉంటుంది. హైదరాబాద్‌లో నెలకి సుమారుగా రూ. 30,000 - రూ. 50,000 ఖర్చవుతుంది. ఢిల్లీ, పూణె, చెన్నై వంటి నగరాల్లోనూ ఖర్చులు రూ. 15,000 నుంచి రూ. 40,000 వరకూ ఉంటాయి. వీటికి అదనంగా EMIs, పిల్లల స్కూల్ ఫీజులు, హెల్త్‌కేర్ ఖర్చులు చేరితే బడ్జెట్ పూర్తిగా దెబ్బతింటుంది.
మెర్సర్ సంస్థ చేసిన సర్వే ప్రకారం, ఈ ఏడాది జీతాల సగటు పెరుగుదల 9.4% మాత్రమే. ఆటో, ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్ రంగాలు మంచి hikes ఇస్తున్నా, IT, ఫార్మా, కన్‌స్ట్రక్షన్ రంగాలు వెనకబడి ఉన్నాయి. ఉద్యోగం మార్చడం ద్వారా 15-17% hike సాధ్యమే అయినా, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ వంటి ఖర్చులు అంతకంటే వేగంగా పెరుగుతున్నాయి. అంటే, జీతం పెరిగినా, ఖర్చులు దాన్ని మించి పోతున్నాయి.
ఇక మరికొన్ని కంపెనీలు జీతం పెరుగుదలను పనితీరు ఆధారంగా ఇస్తున్నాయి. లక్ష్యాలు సాధించకపోతే 2-4% increment మాత్రమే రావచ్చు. ఇది ద్రవ్యోల్బణం కంటే తక్కువ. అంటే, వాస్తవానికి మీరు కష్టపడి పనిచేసినా కూడా, మీ జీతం ద్రవ్యోల్బణం పంజా నుండి మిమ్మల్ని కాపాడలేకపోతుంది.
ద్రవ్యోల్బణం నెమ్మదిగా మీ కొనుగోలు శక్తిని తినేస్తుంది. విద్య ఖర్చులు ఏటా 12% పెరుగుతున్నాయి. హెల్త్‌కేర్ ఖర్చులు జీతాల కంటే మూడు రెట్లు వేగంగా పెరుగుతున్నాయి. ఇల్లు కొనుగోలు చేసేవారి EMIs కూడా రెపో రేటు కారణంగా తగ్గడంలేదు. జీతం పెరిగినా, జీవనశైలి ఖర్చులు ఇంకా వేగంగా పెరగడం వల్ల, నికర లాభం లేకుండానే పోతుంది.
అనేకమంది ఇప్పటికీ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ (FDs)లో డబ్బు పెట్టడం సురక్షితం అని భావిస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే, పన్ను తర్వాత FDs ఇచ్చే రాబడులు 5.5% మాత్రమే. కానీ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ 12%, హెల్త్‌కేర్ ఖర్చులు 10-14% పెరుగుతున్నాయి. కాబట్టి, FDలో డబ్బు పెట్టడం వల్ల దీర్ఘకాలంలో సంపద పెరగదు, బదులుగా అది నెమ్మదిగా తగ్గిపోతుంది. కాబట్టి FDలను తక్కువకాల అవసరాల కోసం మాత్రమే ఉపయోగించడం మంచిది.
2025లో తెలివైన ఆర్థిక వ్యూహాలు:
కేవలం సంపాదనతో ఆగిపోకుండా, ఇన్వెస్టింగ్‌కి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. SIPs, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ వంటి ఆస్తుల్లో డబ్బు పెట్టడం వల్ల ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అదేవిధంగా, ఒకే ఆస్తిపై ఆధారపడకుండా డైవర్సి ఫై చేయాలి. అంటే, ద్రవ్యోల్బణం ని మించే రాబడులు ఇచ్చే ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టి, ఆదాయ మార్గాలు రూపొందించుకోవాలి.
మరో ముఖ్యమైన అంశం ఫైనాన్షియల్ ట్రాకింగ్. మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం, పెట్టుబడులు ఎలా పెరుగుతున్నాయి అనే విషయాలను రెగ్యులర్‌గా పరిశీలించడం అవసరం. నికర విలువని (మొత్తం ఆస్తులు - అప్పులు) క్రమం తప్పకుండా ట్రాక్ చేస్తే, మన ఫైనాన్షియల్ స్థితి ఎటు వెళ్తుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇలా చేస్తే జీతం ఒక్కదానితో కాకుండా, ఇన్వెస్ట్మెంట్స్ మరియు ఆదాయం ద్వారా ద్రవ్యోల్బణాన్ని మించి మీ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications