3 నెలల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు చేతికి రూ.25 లక్షలు!!
స్టాక్ మార్కెట్‌లు గత కొంతకాలంగా తీవ్ర ఊగిసలాటలో ఉన్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తర్వాత, ఇటీవల రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు మార్కెట్ నష్టాలకు కారణంగా మారాయి. సెన్సెక్స్ ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లకు మరో 5000 పాయింట్ల దూరంలో ఉంది. సూచీలు వరుసగా ఆరు రోజుల పాటు నష్టాలను నమోదు చేశాయి. ఇలాంటి సమయంలో కొన్ని స్టాక్స్ లాభాలను కొనసాగిస్తున్నాయి. కొన్ని చిన్న స్టాక్స్ గత కొద్ది నెలల కాలంలో మల్టీ బ్యాగర్ స్టాక్స్‌గా నిలిచాయి. అలాంటి వాటిలో SEL మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్.

2000 శాతం కంటే అధిక రిటర్న్స్
SEL మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ స్మాల్ క్యాప్ స్టాక్. మూడు నెలల కాలంలో అత్యధిక రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్‌లో ఇది ముందు ఉంది. కేవలం మూడు నెలల కాలంలో ఈ స్టాక్ రూ.9.75 నుండి రూ.250ని క్రాస్ చేసింది. అంటే ఈ కాలంలో 2000 శాతం కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది.

రూ.1 లక్షకు రూ.25 లక్షలు
కొద్ది రోజుల క్రితం ఈ స్టాక్‌లో ఎవరైనా రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే వారి చేతికి ఇప్పుడు వారి చేతికి దాదాపు రూ.25 లక్షలు వస్తాయి. ఈ స్టాక్ వారం క్రితం రూ.210 వద్ద ఉంది. ఇప్పుడు రూ.254కు ఎగిసిపడింది. వారం క్రితం ఇన్వెస్ట్ చేసినా భారీగానే చేతికి వచ్చేవి. నెల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.3 లక్షలకు పైగా చేతికి వచ్చేవి. రెండు నెలల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.9 లక్షల వరకు వచ్చేవి. అలాగే, మూడు నెలల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.25 లక్షలు చేతికి వచ్చేవి.

ఎంత పెరిగిందంటే
ప్రస్తుతం ఈ మల్టీ బ్యాగర్ స్మాల్ క్యాప్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8.45 కోట్లుగా ఉంది. 52 వారాల కనిష్టం రూ.1.35 కాగా, గరిష్టం రూ.254.95. ఈ స్టాక్ గత పుష్కర కాలంగా డబుల్ డిజిట్, సింగిల్ డిజిట్ వద్దే ఉంది. గత ఏడాది ఇదే సమయంలో రూ.1.35 వద్దే ఉంది. ఆ తర్వాత క్రమంగా పెరిగింది. ఏడాదిలో రూ.1.35 నుండి రూ.265కు వచ్చింది. 2022 క్యాలెండర్ ఏడాదిలో రూ.210 నుండి 474 శాతం, 6 నెలల కాలంలో 72,742 శాతం, నెల రోజుల కాలంలో 177 శాతం, ఐదు రోజులలో 15 శాతం లాభపడింది.


Click it and Unblock the Notifications