SIP vs LumpSum: ఆదాయ ఆర్జన కోసం పెట్టుబడులు పెట్టే చాలామందికి పలు ప్రశ్నలు వస్తుంటాయి. డబ్బంతా ఒకేసారి పెట్టుబడి పెట్టాలా లేదా విడతలు విడతలుగా ప్రతీ నెల పెట్టుబడులు పెట్టాలా..ఇలాంటి సందేహాలు చాలామందికి కనిపిస్తుంటాయి. ఉదాహరణకు మీ దగ్గర ఆరు లక్షలు రూపాయలు ఉన్నాయనుకుందాం.. మరి ఈ మొతాన్ని ఒకేసారి పెట్టుబడిగా పెట్టాలా లేక అందులో ప్రతి నెలా ఆరు వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టాలా... అనేది మిమ్మల్ని అయోమయానికి గురి చేస్తుంది. అయితే దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే.. రెండింటికీ వేరు వేరు లాభాలు, నష్టాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆదాయం, ఆర్థిక పరిస్థితితో పాటు మార్కెట్ లో నెలకొన్న పరిస్థితులు చూసుకుని ప్లాన్ చేసుకోవాలంటున్నారు. ముఖ్యంగా రిస్క్ భరించగలిగితేనే పెట్టుబడలు జోలికి వెళ్ళమని చెబుతున్నారు.
SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) అంటే ఏమిటంటే.. ప్రతి నెలా ఫిక్స్‌డ్‌గా కొన్ని రూపాయలు మ్యూచువల్ ఫండ్‌కి మళ్లించడం.. నెలనెలకు జీతాలు మీద బతికేవారికి సరిపోయే పద్ధతి ఇది. దీనికి మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో తగ్గుతుందో అంచనా వేయాల్సిన అవసరం లేదు. దీని లాభాల విషయానికి వస్తే..పెట్టుబడి చేసే అలవాటు మీకు ఏర్పడుతుంది.మార్కెట్ తగ్గినప్పుడు ఎక్కువ యూనిట్లు, పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు కొనగలిగే అవకాశం ఉంటుంది. పన్నుల పరంగా తక్కువ ఒత్తిడి ఉంటుంది. నెలవారీ లాభాలు ఎవరైతే ఆర్జిస్తుంటారో వారికి ఇది సరైన లాభంగా చెప్పుకోవచ్చే. అయితే ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే.రిటర్న్ రావడానికీ కొంచెం సమయం పడుతుంది.

Lump Sum పెట్టుబడి అంటే ఏమిటంటే.. ఒకేసారి మొత్తం డబ్బు (ఉదాహరణకురూ. 6 లక్షలు) పెట్టుబడి చేయడంగా చెప్పుకోవచ్చు. అయితే ఇది మార్కెట్ క్రాష్ కాకుండా ఉన్నప్పుడు వేయగలిగితేనే మీకు ఎక్కువ మొత్తం తిరిగి వస్తుంది.ఇక దీని లాభాలు ఏంటంటే.. డబ్బు మొత్తం మొదటి రోజే మీకు అందుతుంది. ఒక వేళ మార్కెట్ పెరిగితే SIP కంటే ఆదాయం మీకు వస్తుంది.ఇది ఐడియాతో ముందుకువెళ్లేవారికి లాభదాయకం. ఇక నష్టాల విషయానికి వస్తే.. మార్కెట్ పడిపోయినప్పుడు నష్టం ఎక్కువగా పడుతుంది. తక్కువ రిస్క్ టాలరెన్స్ ఉన్నవారికి అయితే సమస్య ఉండదు. ఒకేసారి పెట్టుబడి వేయడం కొంతమందికి మానసిక ఒత్తిడిగా అనిపించవచ్చు.
అయితే చాలా మంది తెలివిగా ఏం చేస్తారంటే సగం డబ్బు.. lump sumగా పెట్టుబడి పెట్టి మిగతా సగం SIP రూపంలో నెలలకొకసారి పెట్టుబడిగా పెడుతుంటారు. తద్వారా రిస్క్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడో చిన్న ఉదాహరణను మనం గమనిస్తే.. మీరు జనవరి 2020లో రూ.6,00,000 lump sum పెట్టుబడి పెట్టి ఉంటే COVID సమయంలో భారీ నష్టాన్ని ఎదుర్కునేవారు. అయితే అదే సమయంలో రూ.6,000 SIP మొదలు పెట్టినట్లయితే, మీ పెట్టుబడి మెల్లగా తిరిగి వృద్ధి చెందేది.- ఎందుకంటే మీరు మార్కెట్ తక్కువగా ఉన్నప్పుడూ కొనేవారు.
క్లుప్తంగా నిపుణులు ఏం చెబుతున్నారంటే.. మీ ఆర్థిక స్థితి, లక్ష్యాలు, రిస్క్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని పెట్టుబడులలోకి దిగండి. SIP ఎక్కువ సేఫ్.. కానీ మీకు వచ్చేది తక్కువగా ఉంటుంది. Lump Sum లో వచ్చేది ఎక్కువ..అలాగే రిస్క్ కూడా ఎక్కువ.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications