For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.21 నుండి రూ.941: ఇందులో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.45 లక్షలు చేతికి!

|

భారత స్టాక్ మార్కెట్‌లో 2021లో పలు మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ ఇచ్చాయి. గత క్యాలెండర్ ఏడాదిలో చివరి నెలలో పలు స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఇలాంటి మల్టీ బ్యాగర్ స్టాక్స్‌లో పెన్నీ స్టాక్స్ ఉన్నాయి. అలాంటి పెన్నీ స్టాక్స్‌లో Xpro ఇండియా లిమిటెడ్ ఉంది. 1 అక్టోబర్ 2020లో రూ.21.15 నుండి 31 డిసెంబర్ 2021 నాటికి రూ.941.50కి చేరుకుంది. అంటే ఈ పదిహేను నెలల కాలంలో 44.50 రెట్ల రిటర్న్స్ ఇచ్చింది. మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ Xpro ఇండియా అయిదేళ్ల కాలంలో 1923 శాతం రిటర్న్స్ ఇచ్చింది. నేడు (మంగళవారం, 4 జనవరి, 2022) ఉదయం గం.10.49 సమయానికి ఈ స్టాక్ రూ.945 వద్ద ఉంది.

ఏడాదిలో 4350 రెట్లు జంప్

ఏడాదిలో 4350 రెట్లు జంప్

Xpro ఇండియా గత నెల రోజుల కాలంలో రూ.1003కు చేరుకుంది. 52 వారాల గరిష్టం ఇదే. 52 వారాల కనిష్టం రూ.32.30. ఈ స్టాక్ గత వారం ఐదు శాతం ఎగిసి రూ.897 నుండి రూ.941కి చేరుకుంది. గత ఆరు నెలల కాలంలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ రూ.175 నుండి రూ.941.50కి చేరుకుంది. అంటే 450 శాతం జంప్ చేసింది. గత ఏడాది కాలంలో రూ.35 నుండి రూ.941కి చేరుకుంది. అంటే 2560 రెట్లు పెరిగింది. అలాగే గత 15 నెలల కాలంలో రూ.21.15 నుండి రూ.941కి చేరుకుంది. ఈ కాలంలో 4350 రెట్లు ఎగిసింది.

రూ.1 లక్షకు రూ.44 లక్షలు

రూ.1 లక్షకు రూ.44 లక్షలు

పై లెక్క ప్రకారం... Xpro ఇండియాలో నెల రోజుల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.1.05 లక్షలు వస్తుంది. ఆరు నెలల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.5.50 లక్షలు, ఏడాది క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.26.60 లక్షలు చేతికి వచ్చేవి. అలాగే, 15 నెలల క్రితం రూ.21.15 వద్ద రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు రూ.941కి చేరుకోవడంతో, అలా ఇన్వెస్ట్ చేసిన వారి చేతికి ఇప్పుడు రూ.44.50 లక్షలు వచ్చేవి.

బెంచ్ మార్క్ సూచీ కంటే ఎక్కువ

బెంచ్ మార్క్ సూచీ కంటే ఎక్కువ

Xpro ఇండియా ఈ కాలంలో వేలాది రెట్లు పెరగగా, ఇదే కాలంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ వృద్ధి ఎలా ఉందో చూద్దాం. నిఫ్టీ 11,417 పాయింట్ల నుండి 17,354 పాయింట్లకు పెరిగింది. గత పదిహేను నెలల కాలంలో దాదాపు 52 శాతం జంప్ చేసింది. అలాగే, బీఎస్ఈ సెన్సెక్స్ ఈ పదిహేను నెలల కాలంలో 38,254 పాయింట్ల నుండి 58,254 పాయింట్లకు చేరుకుంది. అంటే 50.50 శాతం ఎగిసింది. అంటే బెంచ్ మార్క్ సూచీల కంటే అత్యధిక రిటర్న్స్ ఇచ్చింది Xpro ఇండియా.

English summary

రూ.21 నుండి రూ.941: ఇందులో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.45 లక్షలు చేతికి! | RS 21 to RS 941: Multibagger stock turns RS 1 lakh to RS 44.5 lakh in 15 months

In post-Covid rebound, Indian stock market has delivered a good number of multibagger stocks in 2021. Some of them have given sharp upside moves in last few months before the year end and hence such shares are still considered multibagger stocks for 2022.
Story first published: Tuesday, January 4, 2022, 11:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X