చెక్కు చుసిన సగం మంది దీని అర్ధం తెలీదు.. కానీ ఖచ్చితంగా ఇలా రాస్తారు...
ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చుసిన ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ పెరిగిపోతున్నాయి. ప్రజలు ఏదైనా వస్తువును కొనుగోలు చేయడానికి డిజిటల్ పేమెంట్ యాప్స్ ప్లాట్‌ఫారమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పటికి చెక్ బుక్ ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు. కొంతమంది నేటికీ కొన్ని డబ్బు లావాదేవీల కోసం చెక్ బుక్కులపై ఆధారపడతారు. చెక్కు ద్వారా పేమెంట్ చేసేటప్పుడు, చెల్లింపుదారుని పేరు, బ్యాంకు వివరాలు అలాగే చెల్లించాల్సిన మొత్తం వంటి వివరాలను వ్రాసి ఉంటుంది. చెక్కు పై అమౌంట్ మొత్తం రాసిన తర్వాత కొంతమంది "Only" అని రాసి స్లాష్ (/-) వేస్తారు. దీన్ని చాలా మంది గమనించరు. అయితే ఇలా గీత ఎందుకు గీస్తారో తెలుసా ?
ONLY అనే పదం తప్పనిసరి కాదా : చెక్కు జారీ చేసేటప్పుడు అమౌంట్ మొత్తం రాసిన తర్వాత only అని రాయకపోతే అది పెద్ద తప్పు కాదు. కొంతమంది "only" అని రాయకపోతే చెక్కు తీసుకుంటారా ? అని కూడా ఆలోచిస్తుంటారు. మీరు డిపాజిట్ చేయకపోయినా చెక్కు వాలిడిటీ అవుతుంది. దీనికి ప్రత్యేక నియమం లేదు. ఈ only అనే పదం రక్షణగా మాత్రమే వ్రాస్తుంటారు.

మీరు ఈ only అనే పదాన్ని రాసి / ఇలా గీస్తే మొత్తం తర్వాత నంబర్లు రాయడానికి అంటే మీరు రాసిన మొత్తంకి ఇంకా ఎక్కువ మొత్తం జోడించడానికి ఆస్కారం ఉండదు. / ఇలా రాయడం వల్ల కొంతమేరకు మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. ఉదాహరణకు, మీరు ఒక వ్యక్తి పేరు మీద రూ.20,000 చెక్కును జారీ చేశారనుకుందాం. మీరు మొత్తాన్ని రాసిన తర్వాత చివరలో ఎం రాయకపోతే రూ.20,000 తర్వాత ఏదైనా సంఖ్యను జోడించవచ్చు. కానీ మీరు రూ.20,000 మాత్రమే/- లేదా ఇంగ్లీషులో twenty thousand only/- అని వ్రాస్తే.. మీరు రాసిన మొత్తం తర్వాత నంబర్లను రాయడానికి ఛాన్స్ ఉండదు.
చెక్కు పైన చివరిలో 2 లైన్స్ ఎందుకు గీస్తారు?: చెక్కు పైన ఎడమ మూలలో గీసిన రెండు లైన్లకు అర్థం కూడా ఉంటాయి. ఈ లైన్లు చెక్కు చెల్లించే వ్యక్తికి మాత్రమే అర్హత ఉంటదని సూచిస్తున్నాయి. మరెవరూ చెక్కును ఎన్‌క్యాష్ చేయలేరు. చెక్కు ఎవరి పేరు మీద డ్రా చేయబడిందో వారి అకౌంట్ మాత్రమే నిధులు ట్రాన్స్ఫర్ చేయబడతాయి.


Click it and Unblock the Notifications