చాలా మంది తమ దగ్గర పెద్ద మొత్తం డబ్బు ఉన్నప్పుడే పెట్టుబడి పెట్టాలని భావిస్తుంటారు. కానీ, ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెట్టుబడి మొత్తానికి ఇచ్చే ప్రాధాన్యత కంటే 'క్రమశిక్షణ' (Discipline) కు ఇచ్చే ప్రాధాన్యతే మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది. మీరు ప్రతిరోజూ కేవలం రూ.100 రూపాయలను ఒక సరైన సిప్ ప్లాన్ (SIP Plan) లో పెట్టుబడి పెడితే.. పదేళ్లలో అది ఒక భారీ మొత్తంగా ఎలా మారుతుందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.

డైలీ SIP అంటే ఏమిటి?
సాధారణంగా మ్యూచువల్ ఫండ్లలో నెలకు ఒకసారి డబ్బులు కట్టే విధానం (Monthly SIP) మనకు తెలుసు. అయితే, ప్రతిరోజూ ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడాన్ని 'డైలీ ఎస్ఐపీ' (Daily SIP) అంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులు లేదా రోజువారీ ఆదాయం వచ్చే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ పద్ధతి వల్ల మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం మీ పెట్టుబడిపై తక్కువగా ఉంటుంది.
రూ. 100 డైలీ ఇన్వెస్ట్‌మెంట్.. 10 ఏళ్ల అంచనా..
మీరు ప్రతిరోజూ రూ.100 చొప్పున ఒక మంచి మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారని అనుకుందాం. సగటున ఏడాదికి 12% రిటర్న్స్ వస్తాయని అంచనా వేస్తే.. పదేళ్ల తర్వాత మీ పరిస్థితి ఇలా ఉంటుంది..
- 10 ఏళ్లలో మీరు పెట్టే మొత్తం పెట్టుబడి.. రూ.3,65,000.
- మీరు ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్.. 12% రిటర్న్స్ ఇస్తుందని అంచనా వేసుకుంటే.. మీరు పొందే లాభం.. రూ.3,40,735
- పదేళ్లలో మీరు పొందే మొత్తం కార్పస్ (Total Value).. రూ.7,05,735
- అంటే, మీరు దాచుకున్న రూ.3.65 లక్షల రూపాయలు పదేళ్లలో దాదాపు రెట్టింపు అయ్యి రూ.7 లక్షలకు పైగా మారుతాయి. ఇదే పెట్టుబడిని 15 లేదా 20 ఏళ్లు కొనసాగిస్తే, 'కాంపౌండింగ్' (Power of Compounding) పవర్‌తో ఈ మొత్తం కోట్లకు కూడా చేరవచ్చు.
డైలీ SIP వల్ల కలిగే ప్రయోజనాలు
- ఆర్థిక క్రమశిక్షణ: చిన్న మొత్తమే కాబట్టి ఖర్చులకు ఇబ్బంది ఉండదు. అలాగే పొదుపు అలవాటు పెరుగుతుంది.
- రిస్క్ తగ్గింపు: ప్రతిరోజూ మార్కెట్లోని వివిధ ధరల వద్ద యూనిట్లు కొనడం వల్ల మీ యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది.
- ఫ్లెక్సిబిలిటీ: మీ అవసరాలకు అనుగుణంగా ఎప్పుడైనా ఈ మొత్తాన్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు.
గమనించాల్సిన విషయాలు
డైలీ ఎస్ఐపీలో లాభాలు ఉన్నప్పటికీ.. కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ప్రతిరోజూ లావాదేవీలు జరుగుతాయి కాబట్టి స్టేట్‌మెంట్ ట్రాక్ చేయడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అలాగే దీర్ఘకాలిక లక్ష్యం ఉన్నవారు మాత్రమే ఇలాంటి సిప్ ప్లాన్ (SIP Plan) ను ఎంచుకోవడం ఉత్తమం. పెట్టుబడి పెట్టే ముందు సదరు మ్యూచువల్ ఫండ్ పనితీరు, రిస్క్ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ముఖ్యం.
ఏదేమైనా.. రోజువారీ చిన్న చిన్న పొదుపులే భవిష్యత్తులో మీ ఆర్థిక అవసరాలకు ఆసరాగా నిలుస్తాయి. కొన్నేళ్ల పాటు పొదుపు చేస్తూ వెళ్లడం ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చేతికందుతుంది. అవి పిల్లల చదువులకో లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోచ్చు. కాబట్టి ఆర్థిక నిపుణుల సలహా మేరకు సరైన మ్యూచువల్ ఫండ్ ఎంచుకుని అందులో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టండి.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications