Robert Kiyosaki: డబ్బు ఎలా సంపాదించాలి.. రాబర్ట్ కియోసాకి ఆసక్తికర వ్యాఖ్యలు..!
ప్రముఖ పెట్టుబడిదారుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఆర్థిక అంశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తన అంచనాలను ఫాలోవర్స్ తో పంచుకుంటారు. ముఖ్యంగా ఆయన ఎక్కువ బంగారం, వెండి, బిట్ కాయిన్, స్టాక్ మార్కెట్లపై అవగాహన కల్పిస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్ గురించి కూడా వివరిస్తుంటారు. తాజాగా డబ్బు వల్ల వచ్చే సమస్యల గురించి ఫాలోవర్స్ వివరించారు. డబ్బుకు సంబంధించిన సమస్యలు రెండు రకాలు మాత్రమే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఒకటి డబ్బు లేకపోవడం, రెండు డబ్బు ఎక్కువగా ఉండటమని తెలిపారు. తాను రెండింటినీ చూస్తూ పెరిగానని తెలిపారు.
పూర్ డాడ్ ఎప్పుడూ సరిపడా డబ్బు లేదనే బాధతో ఉండేవారని.. రిచ్ డాడ్ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉండేదని వివిరంచారు. చాలామంది జీవితంలో డబ్బు సరిపోకపోవడమే పెద్ద సమస్యగా ఉంటుందని తెలిపారు. నెలవారీ ఖర్చులు, అప్పులు, పిల్లల చదువు, వైద్యం, ఇంటి అవసరాలు.. ఇలా ఎన్నో ఖర్చుల మధ్య సంపాదించిన డబ్బు సరిపోదని బాధపడుతుంటారని వివరించారు. డబ్బు ఎక్కువగా ఉన్నవారికి దాన్ని ఎలా నిర్వహించాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా మరింత పెంచుకోవాలి అనే ప్రశ్నలు వేధిస్తుంటాయని పేర్కొన్నారు. ఇక్కడ సమస్య ఇద్దరికీ ఉందని గుర్తు చేశారు.

మన ఆలోచనలే మన ఆర్థిక ప్రపంచాన్ని నిర్మిస్తాయని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. అంటే మనం డబ్బును ఎలా చూస్తామో, దాని ఆధారంగానే మన నిర్ణయాలు మారుతాయని వివరించారు. ఎప్పుడూ నా దగ్గర డబ్బు లేదు, నాకు ఇది సాధ్యం కాదు, నా సంపాదనతో ఇవన్నీ చేయలేను అని ఆలోచించే వ్యక్తి అవకాశాల కంటే సమస్యలనే ఎక్కువగా వస్తాయని తెలిపారు. డబ్బు కొరతే తన జీవితంలో సహజమైన పరిస్థితి అని భావిస్తారని రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. తాను దీన్ని ఎలా సాధించగలను?, ఇంకా ఎక్కువ సంపాదించడానికి ఏం చేయాలి?, నా డబ్బును ఎలా పెంచుకోవాలి? అని ఆలోచించడం ప్రారంభిస్తే.. అతని దృష్టి సమస్య నుంచి పరిష్కారం వైపు వెళ్తుందని చెప్పారు.
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో పోటీ ఎక్కువగా కనిపిస్తుందని.. మంచి ఉద్యోగం కోసం పోటీ, ప్రమోషన్ కోసం పోటీ, మంచి మార్కుల కోసం పోటీ.. ఇలా ప్రతి దశలోనూ ఇతరులతో పోల్చుకోవడం జరుగుతుందని విశ్లేషించారు. ఇలాంటి ఆలోచన మారాలని అవకాశాలు ఇతరులు పొందితే మనకు దక్కదని భావించకూడదని సూచించారు. ఒక అవకాశం దక్కకపోతే మరో అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఉద్యోగం ఒక్కటే సంపాదనకు మార్గం కాదని స్పష్టం చేశారు రాబర్ట్ కియోసాకి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
