అమెరికాకు చెందిన ప్రముఖ ఫైనాన్షియల్ నిపుణులు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి బిట్‌కాయిన్‌పై తన బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. క్రిప్టోకరెన్సీపై విమర్శలు పెరుగుతున్న సమయంలో.. ముఖ్యంగా బిట్‌కాయిన్ కొనుగోలు లేదా విక్రయానికి సంబంధించి ఆయన ఎలాంటి స్పష్టమైన తేదీలు చెప్పడంలేదని విమర్శలు రావడంతో,.. వాటిపై ఆయన సూటిగా స్పందించారు. నాకు తేదీల గురించి పెద్దగా పట్టింపు లేదని కియోసాకి స్పష్టం చేస్తూ, తాను ఎప్పుడూ ఆస్తి యొక్క దీర్ఘకాలిక విలువపైనే దృష్టి పెడతానని స్పష్టం చేశారు.
బిట్‌కాయిన్‌ను తాను తొలిసారి సుమారు 6,000 డాలర్ల స్థాయిలో కొనుగోలు చేశానని కియోసాకి గతంలో వెల్లడించారు. అయితే ఈ ప్రకటన తర్వాత చాలా మంది విమర్శకులు ఆయన మాటలను ప్రశ్నించారు. బిట్‌కాయిన్ నిజంగా ఆ ధర వద్ద ఉన్న సమయంలోనే Robert Kiyosaki కొనుగోలు చేశారా లేదా అన్న సందేహాలు వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై స్పందించిన కియోసాకి, కొనుగోలు చేసిన తేదీ లేదా ఖచ్చితమైన ధర కంటే కూడా, ఆస్తిలో ఉన్న అసలైన శక్తి, భవిష్యత్తులో అది సాధించగల సామర్థ్యమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.

కియోసాకి అభిప్రాయం ప్రకారం, బిట్‌కాయిన్ ధర మళ్లీ 6,000 డాలర్ల స్థాయికి పడిపోయినా ఆయన భయపడరు. అలాంటి పరిస్థితి వచ్చినా కూడా మరింత బిట్‌కాయిన్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటానని ఆయన చెప్పారు. మార్కెట్ పతనాలను భయపడాల్సిన సందర్భాలుగా కాకుండా, బలమైన ఆస్తులను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాలుగా చూడాలని ఆయన భావిస్తున్నారు. రోజువారీ ధరల ఊగిసలాటలను గమనిస్తూ ఆందోళన చెందడం కన్నా, దీర్ఘకాలంలో ఆస్తి విలువ ఎలా పెరుగుతుందనే అంశంపై దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు.
బిట్‌కాయిన్ వంటి డిజిటల్ ఆస్తులు ఎక్కువ ఒడిదుడుకులకు లోనవుతాయని కియోసాకి అంగీకరిస్తున్నారు. అయితే అదే సమయంలో ఈ ఒడిదుడుకులే నిజమైన పెట్టుబడిదారులకు అవకాశాలు తీసుకొస్తాయని ఆయన అభిప్రాయం. మార్కెట్ పడిపోయినప్పుడు పానిక్ అయి అమ్మేయడం కన్నా, బిట్‌కాయిన్ భవిష్యత్తుపై నమ్మకం ఉన్నవారు ఆ సమయంలోనే కొనుగోలు చేయడం ద్వారా లాభపడతారని ఆయన విశ్వసిస్తున్నారు.
కియోసాకి యొక్క ఈ ఆలోచన విధానం క్రిప్టో ప్రపంచంలో ప్రసిద్ధమైన డిప్‌లో కొనుగోలు చేయాలి అనే సిద్ధాంతానికి పూర్తిగా అనుగుణంగా ఉంటుంది. ఆయన మాటల్లో, సంపద సృష్టి అనేది ఒక రోజు లేదా ఒక తేదీపై ఆధారపడి ఉండదు. సరైన ఆస్తులను గుర్తించి, వాటిని దీర్ఘకాలం పట్టుకుని ఉండటమే అసలైన వ్యూహం. క్లుప్తంగా చెప్పాలంటే రాబర్ట్ కియోసాకి బిట్‌కాయిన్ విషయంలో ధరలు లేదా టైమింగ్ కంటే విలువనే ముఖ్యమని మరోసారి స్పష్టం చేశారు. మార్కెట్‌లో వచ్చే ప్రతి పతనాన్ని భయంతో చూడకుండా, అవగాహనతో అవకాశంగా మలచుకోవాలని ఆయన పెట్టుబడిదారులకు ఇస్తున్న సందేశం ఇదే.


Click it and Unblock the Notifications