క్రెడిట్ కార్డు వాడే ప్రతి ఒక్కరూ ఒక దశలో ఈ డైలమాలో పడతారు. రివార్డ్ పాయింట్స్ కలెక్ట్ చేయాలా? లేక సూటిగా క్యాష్‌బ్యాక్ తీసుకోవాలా? ఈ రెండూ మంచి బెనిఫిట్స్‌నే ఇస్తాయి, కానీ ఎలా వర్క్ అవుతాయో, ఎప్పుడు ఏవి బెస్ట్ అనేది క్లారిటీ ఉండాలి.

క్యాష్‌బ్యాక్ అంటే ఏమిటి?
క్యాష్‌బ్యాక్ అనేది మీరు షాపింగ్ చేసిన తర్వాత, ఆ ఖర్చు చేసిన డబ్బులో కొంత మొత్తం మళ్లీ మీ కార్డ్‌కి జమ అవ్వడం. ఉదాహరణకు, మీరు ఆన్‌లైన్‌లో రూ. 1,000 ఖర్చు చేస్తే, 5% క్యాష్‌బ్యాక్ ఉన్న కార్డ్‌తో రూ. 50 తిరిగి మీ అకౌంట్‌కి వస్తుంది. ఇది సింపుల్, క్లియర్ కాబట్టి డైరెక్ట్‌గా డబ్బు సేవ్ కావాలని చూస్తున్నవాళ్లకు క్యాష్‌బ్యాక్‌లు చాలా సూటబుల్.
రివార్డ్ పాయింట్లు అంటే ఏమిటి?
రివార్డ్ పాయింట్ల సిస్టమ్‌లో, మీరు ఖర్చు చేసిన మొత్తానికి పాయింట్లు వస్తాయి. ఉదాహరణకు, ప్రతి రూ. 100 ఖర్చుపై 2 పాయింట్లు ఇస్తుంది. ఫ్యూయల్ మినహా మరియు యుటిలిటీ బిల్లులు, ఇన్షూరెన్స్ బిల్లులపై ప్రతి రూ.100 కి 1 పాయింట్ ఇస్తుంది. కొన్ని కార్డులు మైలిస్టోన్ ఖర్చులు పూర్తి చేసినప్పుడు బోనస్ పాయింట్లను కూడా ఇస్తాయి.
ఉదాహరణకు, పై కార్డ్‌లో రూ. 2 లక్షలు ఖర్చు చేస్తే 2,000 అదనపు పాయింట్లు వస్తాయి.
ఈ పాయింట్లను తర్వాత ఫ్లైట్ టికెట్లు, హోటల్ బుకింగ్స్, షాపింగ్ వౌచర్లు లేదా ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌లలో వస్తువులు కొనడానికి ఉపయోగించవచ్చు.
రివార్డ్ పాయింట్లు vs క్యాష్‌బ్యాక్ ఏవి ఎంచుకోవాలి?
1. అన్ని కార్డుల్లో రివార్డ్ పాయింట్లు ఉంటాయి కానీ రేట్లు వేరువేరుగా ఉంటాయి. హై-వాల్యూ కార్డులు ఎక్కువ పాయింట్లు ఇస్తాయి. ఉదాహరణకు,
*యాక్సిస్ బ్యాంక్ షాపింగ్ రివార్డ్ కార్డ్- ప్రతి రూ. 200కి 2 పాయింట్లు
* యాక్సిస్ బ్యాంక్ మై ఛాయిస్ కార్డ్- ప్రతి రూ. 200కి 4 పాయింట్లు
* యాక్సిస్ బ్యాంక్ ప్రివిలేజ్ క్రెడిట్ కార్డ్- ప్రతి రూ. 200కి 10 పాయింట్లు
2. క్యాష్‌బ్యాక్‌లు సింపుల్, కన్‌ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్‌గా డబ్బు వస్తుంది. కానీ, కొన్ని కార్డుల్లో కనీస ఖర్చు చేసినప్పుడే క్యాష్‌బ్యాక్ ఇస్తారు, లేదా రీడంప్షన్ పరిమితులు ఉంటాయి. అలాంటి షరతులు లేని కార్డులు ఎంచుకోవడం మంచిది.
3. మీరు ఎక్కువగా ఖర్చు చేసే క్యాటగిరీని ముందే చూసుకోవాలి. దానికి సరిపోయే రివార్డ్స్ లేదా క్యాష్‌బ్యాక్ ఇస్తున్న కార్డ్ ఎంచుకుంటే బెనిఫిట్ ఎక్కువగా దక్కుతుంది. ఉదాహరణకు, కొన్ని కార్డులు గ్రాసరీలపై 5% క్యాష్‌బ్యాక్ లేదా ట్రావెల్‌పై 3X పాయింట్లు ఇస్తాయి.
మీరు ఎక్కడ ఎక్కువగా ఖర్చు చేస్తున్నారో గుర్తించండి. గ్రాసరీస్, బిల్లులు, ట్రావెల్ లేదా ఆన్‌లైన్ షాపింగ్ దానికి తగ్గట్లుగా రివార్డ్ పాయింట్లు లేదా క్యాష్‌బ్యాక్ ఎక్కువ ఇస్తున్న క్రెడిట్ కార్డ్ ఎంచుకుంటే, మీరు చేసే ప్రతి ఖర్చులోనూ మంచి సేవింగ్స్ మరియు అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications