Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
SGB premature Price: దేశంలో మోదీ సర్కార్ వచ్చిన తర్వాత బంగారం కొనుగోళ్లను తగ్గించేందుకు సావరిన్ గోల్డ్ బాండ్స్‌ను ప్రవేశపెట్టింది. ఇది పరోక్షంగా బంగారం దిగుమతులను తగ్గించటానికి తోడ్పడుతుందని ప్రభుత్వం భావించింది. తాజాగా వీటికి సంబంధించి కీలక ప్రకటన వచ్చింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 23న 2017-18 సిరీస్ IV, 2018-19 సిరీస్ II ట్రాంచ్‌ల కింద సావరిన్ గోల్డ్ బాండ్స్ ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ధరను నిర్ణయించింది. సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ ప్రకారం ఈ రెండు సిరీస్‌లలోని గోల్డ్ బాండ్స్ కోసం ప్రీమెచ్యూర్ ధరను యూనిట్‌కు రూ.7,325గా నిర్ణయించింది. నిబంధనల ప్రకారం బాండ్ హోల్డర్‌లు జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్ల తర్వాత బాండ్‌ల వడ్డీ చెల్లింపు షెడ్యూల్‌కు అనుగుణంగా ముందస్తుగా రిడీమ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ సౌకర్యం పెట్టుబడిదారులకు లిక్విడిటీని మెరుగుపరుస్తుంది.

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ రిడెంప్షన్ తేదీకి ముందు మూడు పనిదినాల కోసం ప్రచురించిన 999 స్వచ్ఛ బంగారం రేటు సగటు ముగింపు ధర ద్వారా గోల్డ్ బాండ్స్ రిడెంప్షన్ ధర నిర్ణయించబడుతుంది. ఈసారి ఏప్రిల్ 18, 19, 22 తేదీల్లో బంగారం సగటు ముగింపు ధర ఆధారంగా రిజర్వు బ్యాంక్ ప్రీమెచూర్ ఉపసంహరణకు బంగారం గ్రాము ధరను ప్రకటించింది.
గత వారం సెంట్రల్ బ్యాంక్ SGB 2017-18 సిరీస్ III ముందస్తు రిడెంషన్ సులభతరం చేసింది. ఈ సిరీస్ కోసం ధర యూనిట్‌కు రూ.7,260గా నిర్ణయించింది. నవంబర్ 2015లో భౌతిక బంగారం కాకుండా పెట్టుబడి ఎంపికను అందించడానికి కేంద్రం సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి మార్కెట్‌లో భౌతిక బంగారానికి డిమాండ్ తగ్గింది. పైగా ఇవి పెట్టుబడుల విషయంలో పారదర్శకతను దేశంలో మెరుగుపరుస్తోంది. సావరిన్ గోల్డ్ బాండ్‌లలో పెట్టుబడి సంవత్సరానికి 2.5 శాతం వడ్డీ కూడా లభించటం ఇక్కడ గమనించదగిన ప్రయోజనమని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆదాయం మూలం వద్ద పన్నును ఆకర్షిస్తోంది.


Click it and Unblock the Notifications