RBI News: బ్యాంకుపై ఆర్‌బీఐ భారీ జరిమానా.. మార్కెట్లో స్టాక్ క్రాష్.. నిరాశ..
Bank Of India: దేశంలోని బ్యాంకింగ్ రెగ్యులేటర్ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కఠిన పనితీరును కొనసాగిస్తూనే ఉంది. నిబంధనల ఉల్లంఘనను క్షమించేదే లేదని తన వరుస చర్యలతో చెప్పకనే చెబుతోంది.
కొన్ని రెగ్యులేటరీ నిబంధనలను పాటించనందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియాపై 1.4 కోట్ల రూపాయల జరిమానా విధించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ బుధవారం తెలిపింది. ఆర్బీఐ చర్యలు నేడు బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లలో అల్లకల్లోలం కొనసాగింది. ఇంట్రాడేలో బ్యాంక్ స్టాక్ ధర 8.52 శాతం పతనమైన తర్వాత రూ.128.25కి పడిపోయాయి. ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఆర్బీఐ చర్యల కారణంగా కంపెనీ పనితీరుపై ఓ కన్నేసి ఉంచుతున్నారు.

ఇదే క్రమంలో రిజర్వు బ్యాంక్ మరో ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థపై కూడా చర్యలు తీసుకుంది. బంధన్ బ్యాంక్ తన సూచనలు పాటించనందుకు ఆర్బీఐ రూ.29.55 లక్షలు జరిమానాగా విధించింది. 'డిపాజిట్‌లపై వడ్డీ రేటు', 'బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్', 'రుణాలపై వడ్డీ రేటు' మరియు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల నియమాలు, 2006 నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఆర్‌బీఐ ఆదేశాలను పాటించనందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియాపై పెనాల్టీ విధించబడింది.
ఇదే క్రమంలో ఎన్‌బీఎఫ్‌సీపై ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై కూడా చర్యలు తీసుకుంది. రిజర్వు బ్యాంక్ ఆదేశాల ప్రకారం 2016లో మోసాలను పర్యవేక్షించటం, కేవైసీ ఆదేశాల్లోని కొన్ని నిబంధనలను పాటించనందుకు రూ.13.60 లక్షల పెనాల్టీ విధించినట్లు రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. పైన పేర్కొన్న అన్ని సందర్భాల్లోనూ రెగ్యులేటరీ సమ్మతిలో లోపాల కోసం జరిమానాలు విధించబడ్డాయి.


Click it and Unblock the Notifications