For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2021లోనే 25% రిటర్న్స్ ఇచ్చిన రిలయన్స్, రూ.17 లక్షల కోట్లను తాకి..

|

బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం (సెప్టెంబర్ 27) సరికొత్త రికార్డుకు చేరుకుంది. ఆయిల్ టు టెలికం దిగ్గజం దేశంలోనే మోస్ట్ వ్యాల్యుబుల్ కంపెనీ. నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ భారీగా లాభపడింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17 లక్షల కోట్లను తాకింది. రిలయన్స్ మాత్రమే కాదు, ఈ మార్కు తాకిన మొట్టమొదటి భారత కంపెనీ ఇదే. ఇటీవలే ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16 లక్షల కోట్లను దాటింది. కొద్ది సెషన్‌లలోనే మరో రూ.1 లక్ష కోట్లు క్రాస్ చేసింది. నేడు మధ్యాహ్నం సెషన్‍‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర 1.5 శాతం ఎగిసి రూ.2,520 వద్ద ఉన్నప్పుడే మార్కెట్ క్యాప్ సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత ఈ స్టాక్ రూ.2,523కు చేరుకుంది. సాయంత్రానికి మరికాస్త పెరిగి రూ.44.30 (1.78%) లాభపడి రూ.2,527.00 వద్ద ముగిసింది. రిలయన్స్ స్టాక్ రూ.2,487.00 వద్ద ప్రారంభమై, రూ.2,529.90 గరిష్టాన్ని, రూ.2,475.30 కనిష్టాన్ని తాకింది. 52 వారాల గరిష్టం రూ.2,529.90. 52 వారాల కనిష్టం రూ.1,830.00. రిలయన్స్ స్టాక్‌కు ఈరోజుదే ఆల్ టైమ్ గరిష్టం ధర.

2021లో 25 శాతం రిటర్న్స్

2021లో 25 శాతం రిటర్న్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత ఏడు సంవత్సరాల్లోనే భారీగా పెరిగింది. సెన్సెక్స్, నిఫ్టీ 50లో హెవీ వెయిట్ రిలయన్స్ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది. ఇటీవలి కాలంలో రిలయన్స్ షేర్లు వరుసగా రికార్డులు సృష్టిస్తున్నాయి. గత శుక్రవారం (సెప్టెంబర్ 24) నాటికి రిలయన్స్ షేర్ 2021 క్యాలెండర్ ఏడాదిలో ఏకంగా 25 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఇదే కాలంలో సెన్సెక్స్ కూడా దాదాపు అదే స్థాయిలో 26 శాతం లాభపడింది. సెప్టెంబర్ 2020లో రూ.2,200కు పైన ఉన్న రిలయన్స్ స్టాక్ ధర ఆ తర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో మరోసారి పడిపోయింది. 2020 మార్చిలో కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో అయితే పాతాళానికి పడిపోయింది. ఆ సమయంలో దాదాపు వెయ్యి స్థాయికి పడిపోయింది. 2020 అక్టోబర్ నెలలో రూ.2,300 సమీపానికి వచ్చింది. కానీ అంతలోనే క్రమంగా పడిపోతూ రూ.1850 స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత జనవరి వరకు రూ.2,000 మార్కును చేరుకోలేదు. జనవరి మిడ్‌లో ఈ కీలక మార్కును దాటింది. జనవరి చివరి వారంలో మళ్లీ రూ.1900 దిగువకు పడిపోయింది. మార్చి నాటికి మళ్లీ రూ.2100 దాటి రూ.2200 దిశగా కనిపించింది. సెకండ్ వేవ్ దెబ్బకు రూ.2000 దిగువకు పడిపోయింది. సెకండ్ వేవ్ అనంతరం క్రమంగా కోలుకుంటూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మే తర్వాత రిలయన్స్ షేర్ రూ.2000 దిగువకు పడిపోలేదు. పైగా ఈ కాలంలో రూ.500కు పైగా లాభపడింది. ముఖ్యంగా

అందుకే రిలయన్స్ పరుగు

అందుకే రిలయన్స్ పరుగు

రిలయన్స్ మార్కెట్ క్యాప్ వరుసగా ఆగస్ట్ నెల చివరి నుండి ఈ నెల రోజుల కాలంలో రూ.2200 నుండి రూ.2,527కు ఎగిసిపడింది. రిలయన్స్ గ్రూప్‌లోని జియో టెలికం రంగంలో దూసుకెళ్తోంది. జామ్‌నగర్‌లో గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్‌కు సంబంధించి ముఖేష్ అంబానీ గత నెలలో ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించి రూ.75,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నారు. 2030 నాటికి భారత్‌కు 450 గిగావాట్స్ రినెవెబుల్ అవసరం కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 100 గెగావాట్స్‌ను ఉత్పత్తి చేసే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. వివిధ అంశాల ప్రభావంతో గత ఏడాది, ముఖ్యంగా నెల రోజుల కాలంలో రిలయన్స్ పరుగులు పెడుతోంది.

రిలయన్స్ మార్క్...

రిలయన్స్ మార్క్...

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏప్రిల్ 2014లో రూ.3 లక్షల కోట్ల మార్కుకు చేరుకుంది.

మార్చి 2017లో రూ.4 లక్షల కోట్లకు, అదే ఏడాది జూలై నెలలో రూ.5 లక్షల కోట్లకు, అక్టోబర్ నెలలో రూ.6 లక్షల కోట్లకు చేరింది.

జూలై 2018న రూ.7 లక్షల కోట్ల మార్కును దాటింది. అదే ఏడాది ఆగస్ట్ నెలలో రూ.8 లక్షల కోట్లు మార్కు దాటిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏడాది తర్వాత అంటే అక్టోబర్ 2019న రూ.9 లక్షల కోట్లకు చేరుకుంది. 2019 నవంబర్ నెలలో రూ.10 లక్షల కోట్లక, జూన్ 2020లో రూ.11 లక్షలకోట్లకు, జూలై 2020లో రూ.12 లక్షల కోట్లకు చేరుకుంది. ఇదే నెలలో రిలయన్స్ మూడు ఫీట్లు సాధించింది. జూలై 2020లోనే రూ.12 లక్షల కోట్లు, రూ.13 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్ల మార్కును అందుకుంది. సెప్టెంబర్ 2020లో రూ.15 లక్షల కోట్లను దాటింది. రూ.16 లక్షల కోట్లనూ అదే నెలలో క్రాస్ చేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్, ఆర్థిక రికవరీ నెమ్మదించడం వంటి వివిధ కారణాలతో మార్కెట్లతో పాటు రిలయన్స్ స్టాక్ కూడా మందగించింది. ఆ తర్వాత మార్కెట్ క్యాప్ రూ.12 లక్షల కోట్ల స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకున్నప్పటికీ, ఏడాది తర్వాత మళ్లీ రూ.17 లక్షల కోట్లను అందుకుంది.

టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్

టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్

- రిలయన్స్ ఇండస్ట్రీస్ - మార్కెట్ క్యాప్ రూ.1600836.18

- టీసీఎస్ - మార్కెట్ క్యాప్ రూ.1419307.52

- HDFC బ్యాంకు లిమిటెడ్ - మార్కెట్ క్యాప్ రూ.899420.62

- ఇన్ఫోసిస్ - మార్కెట్ క్యాప్ రూ.730428.42

- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ - మార్కెట్ క్యాప్ రూ.636938.95

- HDFC - మార్కెట్ క్యాప్ రూ.513552.86

- ICICI బ్యాంకు లిమిటెడ్ - మార్కెట్ క్యాప్ రూ.506072.99

- బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ - మార్కెట్ క్యాప్ రూ.470544.04

- కొటక్ మహీంద్రా బ్యాంకు లిమిటెడ్ - మార్కెట్ క్యాప్ రూ.403376.78

- ఎస్బీఐ - మార్కెట్ క్యాప్ రూ.398216.17

English summary

2021లోనే 25% రిటర్న్స్ ఇచ్చిన రిలయన్స్, రూ.17 లక్షల కోట్లను తాకి.. | Reliance Market cap hits RS 17 lakh crore mark as shares hit record high

Mukesh Ambani led Reliance Industries‘ shares scaled a record high on Monday, cementing the oil to telecom conglomerate’s position as the country’s most valuable company.
Story first published: Monday, September 27, 2021, 20:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X